థియేటర్ల పున: ప్రారంభంకు తేదీ ఖరారు, జనాలు వచ్చేనా?

కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 2.0 లో భాగంగా మరిన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెల్సిందే.అయితే థియేటర్లకు మాత్రం మరికొంత సమయం వెయిట్‌ చేయాల్సిందే అంటూ చెప్పింది.అయితే ఈసారి అన్‌లాకింగ్‌లో థియేటర్లకు లాక్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఖచ్చితంగా థియేటర్లు ఆగస్టు 1 నుండి పున: ప్రారంభించేందుకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం నుండి థియేటర్ల యాజమాన్యంకు సమాచారం అందిందట.

 Movie Theaters Running In This Year Ending, Coronavirus, Lock Down, Movie Theate-TeluguStop.com

థియేటర్లలో సామాజిక దూరం పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు.థియేటర్లు ఓపెన్‌ అయితే జనాలు వస్తారనే నమ్మకం మాత్రం చాలా మందికి లేదు.

హోటల్స్‌ ఓపెన్‌ అయిన సమయంలో అంతా కూడా ఎగబడుతారని అనుకున్నారు.కాని కనీసం 30 శాతం మంది జనాలు కూడా రాకపోవడంతో ఓపెన్‌ అయిన హోటల్స్‌ మళ్లీ మూత పడుతున్నాయి.

ఈ సమయంలో థియేటర్ల పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయాంశంగా ఉంది.

Telugu Central, Coronavirus, Lock, Theaters, Suresh Babu, Tollywood, Un Lock-

సురేష్‌బాబు వంటి స్టార్‌ నిర్మాతలు ఖచ్చితంగా థియేటర్లను అక్టోబర్‌ నవంబర్‌ వరకు ప్రారంభించకుంటేనే బెటర్‌ అన్నట్లుగా చెబుతున్నారు.థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి కదా అని అంతా సినిమాల విడుదలకు సిద్దం అవుతారు.కాని ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో మరింత నష్టపోతారంటూ నిర్మాతలు భావిస్తున్నారు.

ఆగస్టులో థియేటర్లు ఓపెన్‌కు అనుమతులు వచ్చినా పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేది మాత్రం ఈ ఏడాది చివర్లో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube