పెద్ద పెద్ద మాల్స్‌లో సినిమా స్క్రీన్లు, ఫుడ్ కోర్టులను పై ఫ్లోర్లలోనే ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

ఒకప్పుడు కేవలం మెట్రో సిటీలకే మాత్రమే పరిమితమైన మాల్స్ ఇప్పుడు పట్టణాలు, నగరాలకు వ్యాపించాయి.ఫుడ్‌ కోర్టులు, సినిమా స్క్రీన్లు, దుస్తులు, కిరాణా సామాను, ఎంటర్‌టైన్‌మెంట్, బార్లు, మొబైల్‌ షాపులు.

 Un Known Facts Of Food Courts And Big Screens In Shopping Malls-TeluguStop.com

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల షాపులను మాల్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు.అంటే మాల్స్ లో దొరకనిదంటూ ఏదీ లేదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.

అయితే ఎక్కడైనా మాల్స్‌లలో ఫుడ్ కోర్టులు, సినిమా స్క్రీన్లు కేవలం టాప్‌ ఫ్లోర్‌లలోనే ఉంటాయి గమనించారా? ఇలా కేవలం పై ఫ్లోర్లలోనే ఫుడ్‌ కోర్టులు, సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు గల కారణాలు ఏమిటో తెలుసా.?

సాధారణంగా మాల్స్‌లో కింది ఫ్లోర్స్‌లలో రక రకాల షాపులుంటాయి.ఇక పై ఫ్లోర్‌లో స్క్రీన్లు, దానికి కింద ఉన్న ఫ్లోర్‌లో ఫుడ్‌ కోర్టులు ఉంటాయి.అలా ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.

వాటిని గనక ఒక వేళ కిందే పెడితే జనాలు ఎక్కువగా వచ్చేది వాటికే కనుక వాటికి వెళ్లి ఎంజాయ్‌ చేసి వెంటనే వెళ్లిపోతారు.అదే వాటిని పై ఫ్లోర్లో పెట్టారనుకోండి.

జనాలు వాటిలో ఎంజాయ్‌ చేశాక, కిందకు వెళ్లేటప్పుడు రక రకాల స్టోర్స్‌ను చూస్తారు.దీంతో వారికి ఏదైనా షాపులో ఏదైనా ప్రొడక్ట్‌ నచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

దీంతో ఆయా షాపులకు బిజినెస్‌ కూడా వర్కవుట్‌ అవుతుంది.ఇది నిజానికి ఓ ట్రాప్‌ లాంటిది.

బేసిగ్గా మనకు షాపింగ్ అంటే చాలా ఇంట్రస్ట్ ఉంటుంది.అలాంటిది షాపుల్లో కళ్లకు ఆకట్టుకునే వస్తువులు కనిపిస్తే కొనుగోలు చేయకుండా ఉంటామా…? ఖచ్చితంగా కొంటాం.కనుకనే మనల్ని ఆకట్టుకునేందుకు మాల్స్‌లో అలా కింది ఫ్లోర్స్‌లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేస్తారు.ఇదండీ అసలు సంగతి.ఇలాంటి ట్రిక్స్ పాటించే వినియోగదారులను బుట్టలో వేసుకుంటారు.మనం ఈజీగా వాళ్ల ట్రాప్లో పడిపోతాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube