శివలింగం అంటే ఏమిటి? శివలింగాన్ని పెళ్లి కాని యువతులు పూజించకూడదా?  

Un Known Facts About Shiva Linga According To Hindu Dharma Shastra-

Lord Shiva is one of the deities worshiped by the Hindus as the god of worship. He has many devotees. Devotees of Lord Shiva are worshiped on Monday. Some people do not eat non-vegetarian food on that day. In addition, there is fasting. However, the rest of the deities worship the idols and idols in their forms, but Shiva is worshiped by devotees in the form of gender. Yes, wherever you go to Shiva, there is no Shiva idol. Only gender. But there are a few things that we need to know about this Shiva Linga.

Shivalingam is not just gender, it is 3 parts. The bottom portion is Brahma as the form of God, the middle of which is the form of Vishnu, the epitaph of the upper part. The lower part of the gender is called the vagina. Yes, that's it. Most people do not know this thing. The Linga-Yoni confluence is considered symbolic of Shiva Linga. That's all the universe. For an infinite unity, it is called index. Similarly, the limb and the vaginal portions in the shivling indicate the human organs of the human organs. .

..

..

..

హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్ల‌లో శివుడు కూడా ఒక‌రు. ఈయ‌న‌కు చాలా మంది భ‌క్తులు ఉంటారు. ముఖ్యంగా శివున్ని భ‌క్తులు సోమ‌వారం పూజిస్తారు..

శివలింగం అంటే ఏమిటి? శివలింగాన్ని పెళ్లి కాని యువతులు పూజించకూడదా?-Un Known Facts About Shiva Linga According To Hindu Dharma Shastra

కొంద‌రు ఆ రోజున మాంసాహారం తిన‌రు. దీనికి తోడు ఉప‌వాసం కూడా ఉంటారు. అయితే మిగిలిన దేవుళ్లు, దేవ‌త‌ల‌ను వారి వారి రూపాల్లో ఉన్న విగ్ర‌హాల‌ను, చిత్రాల‌ను పూజిస్తారు కానీ శివున్ని మాత్రం లింగం రూపంలో భ‌క్తులు పూజిస్తారు.

అవును, ఎక్క‌డ శివాల‌యానికి వెళ్లినా అక్క‌డ శివుని విగ్ర‌హం ఉండ‌దు. లింగం మాత్ర‌మే ఉంటుంది. అయితే ఈ శివ‌లింగం గురించి మ‌నం తెలుసుకోవాల్సిన కొన్ని విష‌యాలు ఉన్నాయి, అవేమిటంటే.

శివ‌లింగం అంటే కేవ‌లం లింగం మాత్ర‌మే కాదు, ఇది మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. కింది భాగం బ్ర‌హ్మ దేవుని రూపంగా, మ‌ధ్యభాగం విష్ణు రూపంగా, పై భాగం శివ‌రూపంగా భావిస్తారు. ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు.

అవును, అదే. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు. లింగం-యోనిల సంగ‌మ‌మైన శివ‌లింగం విశ్వానికి ప్ర‌తీక అని భావిస్తారు..

స‌మ‌స్త విశ్వం అందులో ఉంటుంద‌ట‌. అనంత‌మైన ఐక్య‌త‌కు, జీవోద్భావ‌న‌కు అది సూచిక అని అంటారు. అదేవిధంగా శివ‌లింగంలో ఉండే లింగం, యోని భాగాలు మానవ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ అవ‌య‌వాల‌ను సూచిస్తాయి.

లింగం అంటే పురాణాల్లో నాశ‌నం లేనిద‌ని, స్థిర‌మైంద‌ని, దృఢ‌మైంద‌ని, మ‌న్నికైంద‌నే అర్థాలు చెప్పారు. ఇవ‌న్నీ క‌లిసి ఉన్న భాగం లింగ‌మ‌ని అన్నారు. ఇది అనంత‌మైన శ‌క్తిని జ‌నింప‌జేస్తుంద‌ని విశ్వాసం. అందుకే శ‌క్తిని పొందాలంటే లింగాన్ని పూజించాల‌ని చెప్పారు.

ఓం న‌మఃశివాయ అనే మంత్రం ప‌ఠించి శివున్ని పూజిస్తే లింగారాధాన చేసిన‌ట్టు అవుతుంద‌ట‌. దీంతో సాక్షాత్తూ శివుడిలోని శ‌క్తి భ‌క్తుల్లోకి చేరుతుంద‌ని న‌మ్ముతారు. అయితే వివాహం కాని యువ‌తులు శివున్ని పూజించ‌రాద‌ట‌..

కానీ వారు పార్వ‌తీ దేవితో క‌ల‌సి ఉన్న శివున్ని పూజించ‌వ‌చ్చ‌ట‌. దీంతో వారికి మంచి భ‌ర్త దొరుకుతాడ‌ట‌. ఇక వారు 16 సోమ‌వారాల పాటు ఉప‌వాసం ఉండి శివారాధ‌న చేస్తే చాలా మంచి జ‌రుగుతుంద‌ట‌.!4 Attachments