హీరో రాజశేఖర్ జీవితంలో జీవిత కంటే ముందు మరో అమ్మాయ్ ఉందని మీకు తెలుసా?

తెలుగు, తమిళ నటుడు రాజశేఖర్ గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.చాలా వరకు మంచి మంచి హిట్ లను అందుకున్న రాజశేఖర్ ఇప్పుడు కూడా మంచి మంచి హిట్ లను అందుకుంటున్నాడు.

 Un Known Facts About Hero Rajashekar , Hero Rajashekar , Personal Life , Tollyw-TeluguStop.com

ఇక ఈయన మరో సినీ నటి జీవితను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.వాళ్లను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా పరిచయం చేశాడు.

ఇదిలా ఉంటే రాజశేఖర్ జీవితంలో జీవిత కంటే ముందు మరో అమ్మాయి ఉందట.

జీవిత రాజశేఖర్ ను పెళ్లి చేసుకునే ముందు రాజశేఖర్ కు మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందట.

ఇక ఈ విషయాన్ని జీవితనే నేరుగా చెప్పింది.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

పెళ్లికి ముందే తను రాజశేఖర్ తో చాలా సన్నిహితంగా ఉండేదట.సినిమా షూటింగ్ ల సమయంలో తమకు వేర్వేరు గదులు ఇచ్చినా కూడా రాజశేఖర్ తోనే ఉండేదట.

ఆ సమయంలో రాజశేఖర్ తో తనకు ఇబ్బందులు ఉండేవి కాదని తెలిపింది.తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి తన తల్లిదండ్రులు చాలాసార్లు భయపడ్డారట.

Telugu Abourajashekar, Rajashekar, Jeevitha, Kollywood, Magadu, Personal, Tollyw

రాజశేఖర్ తో పెళ్లి చేసుకోకుంటే ఎలా అని ప్రశ్నిస్తే.మంచి స్నేహితురాలిగా ఉంటానని వారితో చెప్పిందట.ఇక ఆ సమయంలోని ఇండస్ట్రీకి చెందిన మరో నటితో పెళ్లి ఫిక్స్ అయిందట.ఇక ఆ అమ్మాయి పేరు చెప్పకపోగా.రాజశేఖర్ మాత్రం ఆ అమ్మాయిని పరిచయం చేశాడట.ఇక ఆ అమ్మాయి కూడా తనతోనే చదువుకుందని తెలిపింది జీవిత.

ఓ రోజు రాజశేఖర్, ఆ అమ్మాయి, తను కలిసి గుడికి కూడా వెళ్లారట.కాని ఆరోజు కారులో తను వెనకాల సీట్లో కూర్చున్నానని తెలిపింది.

ఆ రోజు బాగా గడిచిందని తెలిపింది.

Telugu Abourajashekar, Rajashekar, Jeevitha, Kollywood, Magadu, Personal, Tollyw

ఆ తర్వాత మళ్లీ రాజశేఖర్ తో కలిసి సినిమాలలో నటించిందట.ఇక ఆ అమ్మాయి, వాళ్ళ కుటుంబం రాజశేఖర్ తో రిలేషన్ కట్ చేయమని చెప్పారట.కానీ రాజశేఖర్ ఒప్పుకోలేదట.

తను మాత్రం తనకు ఏది అనిపిస్తే అదే చేయమని అన్నదట.కొన్ని రోజుల తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట.

రాజశేఖర్ కు మగాడు సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ అవ్వడంతో నెల రోజుల పాటు ఆయనతో పాటే హాస్పిటల్ లో ఉన్నానని తెలిపింది.

Telugu Abourajashekar, Rajashekar, Jeevitha, Kollywood, Magadu, Personal, Tollyw

కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ తల్లిదండ్రులు తనని కూడా తమ ఇంటికి తీసుకొని వెళ్లారట.ఆ సమయంలో వారి పెళ్లికి కూడా ఒప్పుకున్నారట.ఆ సమయంలో పెళ్లి చేసుకుందాం అనే సరికి తన తండ్రి చనిపోవడంతో ఓ ఏడాది ఆగాల్సి వచ్చిందని తెలిపింది జీవిత.

ఇక పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో కలిసి నటించామని తెలిపింది.కొన్నేళ్ళకి తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని ఆ సమయంలో మెల్లమెల్లగా తను సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది.

ఇక తన కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకోవడంతో వాళ్ళని కూడా పరిచయం చేశానని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube