ఆషాడం గురించి అవన్ని పుకార్లే అసలు విషయం ఏంటీ అంటే  

Un Known Facts About Ashada Masam -

ప్రస్తుతం ఆషాడమాసం నడుస్తోంది.మొన్నటి వరకు పెళ్లిల్లు ఏ స్థాయిలో జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Un Known Facts About Ashada Masam

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సీజన్‌లో లక్షలాది పెళ్లిలు జరిగాయి.నాలుగు నెలల వరకు మంచి రోజులు లేవంటూ బ్రహ్మణులు చెబుతున్న నేపథ్యంలో హడావుడిగా పెళ్లిలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.

మొన్నటి వరకు పెళ్లిలు చేసుకున్న వారంతా కూడా ఇప్పుడు భర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాడమాసంలో కొత్తగా పెళ్లి అయిన వారు కలిసి ఉండవచ్చు.

ఆషాడం గురించి అవన్ని పుకార్లే అసలు విషయం ఏంటీ అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కొత్తగా పెళ్లి అయిన వారు మొదటి ఆషాడమాసంలో కలిసి ఉండవద్దని పెద్దలు అంటూ ఉంటారు.ఆషాడమాసంలో కోడలు అత్త మొహం చేస్తూ అత్తకు గండం అని, అల్లుడు మామ మొహం చూస్తే మామకు గడం అంటూ మనోళ్లు నమ్ముతూ ఉంటారు.అయితే అవన్ని మూడ నమ్మకాలు అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అంటున్నారు.ఎంతో మంది ఆషాడంలో కలవడం చూసుకోవడం చేస్తూనే ఉన్నారు.మరి వారి తల్లిదండ్రులకు ఏమీ కాలేదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇది ఖచ్చితంగా మూడ నమ్మకమే.

కాని దీన్ని పాటించేందుకు ఒక మంచి కారణం కూడా ఉందని చదువుకున్న వారు కూడా అంటున్నారు.

మూడ నమ్మకాలను పక్కన పెడితే కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత ఒక నెల రోజుల పాటు గ్యాప్‌ వస్తే వారి మద్య విరహ వేదన కలుగుతుంది.దాంతో వారిద్దరి మద్య ప్రేమ మరింతగా పెరుగుతుంది.ఆ తర్వాత కలిస్తే కొన్ని రోజుల ఎడబాటుకే ఇంత ఇబ్బంది అయ్యిందనే ఫీలింగ్‌తో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సర్దుకుని సంతోషంగా ఉంటారు.

ఇక కొత్తగా పెళ్లి అయిన కుర్రాడు పనులు వదిలి పెట్టి పెళ్లాం కొంగు పట్టుకుని తిరగకుండా ఉండేందుకు కూడా ఈ ఆషాడంను సృష్టించారంటూ కొందరు నమ్ముతూ ఉన్నారు.మొత్తానికి ఆషాడం అనేది పాటించదగ్గ మూడ నమ్మకం అంటూ పెద్దలు మరియు చదువుకున్న వారు కూడా అంటున్నారు.మంచి జరుగుతుందనుకుంటే పాటించడంలో తప్పేం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Un Known Facts About Ashada Masam- Related....