వింతైన వివాహ పధ్దతులు... ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ల పెళ్లి ఏ పధ్దతిలో జరిగిందో తెలుసా..

పెళ్లి అంటే పందిరి,తలంబ్రాలు,సప్తపది,కన్యాదానం ఇలా ఎన్నో సంప్రదాయాల కలబోత.అయితే ఈ వివాహ సంప్రాదాయాలు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటాయి.

 Un Know Facts Of Wedding In World Wide-TeluguStop.com

మన దేశంలోనే రకరకాల పద్దతులో వివాహాలు జరుగుతుంటాయి.కానీ ప్రపంచంలో జరిగే అనేక రకాల పెళ్లి తంతుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

వాటిల్లో కొన్ని ఛీ యాక్ అనిపిస్తే,మరికొన్ని భయపెడతాయి.ఇంకొన్ని నవ్విస్తాయి.అవేంటో మీరే చదవండి.

ఛీ యాక్.ఉమ్మేస్తారు.



పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం కెన్యాలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది.ఛీ యాక్ ఇదేం సాంప్రదాయం అంటారా?కానీ నిజం మస్సాయ్ అనే తెగ వారి పెళ్లితంతు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.వధువు తండ్రి తన కుమార్తె తలపై, రొమ్ములపైన ఉమ్మి వేస్తాడు.

ఇలా చేయడం వల్ల తన కూతురికి మంచి జరుగుతుందని వారు భావిస్తారు.అక్కడి వాళ్లు కూతుర్లను ఈ విధంగానే ఆశీర్వదిస్తారు.

సౌండ్ తో భయపెడతారు.



చారివారి పద్ధతిలో పెళ్లి అయిపోయకా దంపతులకు బంధువులు చుక్కలు చూపిస్తారు.పెళ్లికి వచ్చిన స్నేహితులు, బంధువులంతా కలిసి పెళ్లి జరిగిన ఇంటి ముందు మకాం వేసి ఎవరూ భరించలేనంత శబ్దాలు చేస్తూ ఉంటారు.కొత్తగా పెళ్లి అయిన జంట వెళ్లి వాళ్లందరికీ స్నాక్స్, పానీయాలు స్వయంగా ఇవ్వాలి.

అప్పడు ఆ శబ్దాలు ఆపుతారు.ఇది ఒక ఫ్రెంచ్ జానపద ఆచారం.

అరటి చెట్టుతో పెళ్లి.


మంగలిక్ వివాహ పధ్దతి.మన బాలివుడ్ స్టార్లు ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ల పెళ్లి ఈ విధంగానే జరిగింది.మంగలిక్ శాపం ఉన్న మహిళను చేసుకుంటే పెళ్లయ్యాక ఇద్దరిలో ఒకరు అకాల మరణం చెందుతారని నమ్ముతారు.

అందువల్ల మంగాలిక్ కు ముందుగా విష్ణు విగ్రహం లేదా ఒక మట్టి కుండ లేదా పెపాల్ లేదా అరటి చెట్టులతో వివాహం చేస్తారు.ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు పెళ్లి చేసుకునే ముందు ఈ పద్ధతి పాటించారు.తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

చచ్చింది గొర్రె.


పెళ్లికొడుకుని చితక్కొడుతారు.అమ్మో అని భయపడ్తున్నారా.డోంట్ వర్రీ ఆ ఆచారం మన దేశంలో లేదు.దక్షిణ కొరియాలో ఉంది.పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికొడుకుని అతని స్నేహితుల కొడతారు.వరుని కాళ్లపై అదేపనిగా తంతారు.

అందుకోసం ఒక్కోసారి కట్టెలను కూడా ఉపయోగిస్తారు.పెళ్లికొడుకు ఎంత గట్టివాడో తెలుసుకునేందుకే వారు ఇలా చేస్తారు.దక్షిణ కొరియా అమ్మాయిని చేస్కోవాలనుకుంటే మాత్రం ముందే ప్రిపేర్ అవ్వండి.

పెళ్లికూతురు కిడ్నాప్.


పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తేనే పెళ్లి అవుతుంది అక్కడ.

రోమానీ లేదా జిప్సీలు ఇలాంటి సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు.చేసుకోబోయే అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేయగలిగితేనే ఆమె అతని భార్య అవుతుంది.

క్రైయింగ్ వెడ్డింగ్.


పెళ్లికి ఒక నెల ముందు నుంచి వధువు రోజూ ఒక గంట పాటు ఏడుస్తూ ఉంటుంది.10 రోజుల ముందు ఆమె తల్లి కూడా పెళ్లికూతురితో పాటు ఏడుస్తూ ఉంటుంది.ర్వాత, ఆమె అమ్మమ్మ, సోదరీమణులు కూడా ఆమెకు తోడుగా ఉండి ఏడుస్తూ ఉంటారు.

మొత్తం అందరూ కలిసి ఏడుస్తుంటే అది కూడా కాస్త వినుసొంపుగానే ఉంటుంది.ఆ ఏడుపులో వాళ్లు చాలా హావాభావాలు పలికిస్తారు.ఈ ఆచారం చైనావారు పాటిస్తారు.

నో టాయిలెట్.


ఉత్తర బోర్న్యోలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఇంట్లోనే ఉండాలి,బాత్రూంకి వెళ్లకూడదు.టిడోంగ్ కమ్యూనిటీకి చెందిన గిరిజనుల్లో ఈ సంప్రదాయం ఉంది.పెళ్లయిన మూడు రోజుల వరకు పెళ్లికూతురు, పెళ్లికొడుకు మూత్రవిసర్జన చేయకూడదు.

ఇదేం బంపర్ ఆఫర్రా బాబూ.


పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు స్వీడన్లో ఈ సంప్రదాయం ఉంది.వధువు లేదా వరుడుని పెళ్లికి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టమొచ్చినట్లు ముద్దుపెట్టుకోవచ్చు.అయితే దీనికి ఒక కండీషన్ ఉంది.వధువు, వరుడుని వదిలి బాత్రూమ్ కు వెళ్తే.వరుడిని అక్కడ ఉండే అమ్మాయిలు ముద్దుపెట్టుకోవొచ్చు.అలాగే వరుడు వధువుని విడిచి వెళ్తే కూడా అబ్బాయిలు ముద్దుపెట్టుకోవొచ్చు.

పాపం పెళ్లికూతురు.


వరుడు పెళ్లికి ముందు ఒక విల్లు తీసుకుని బాణంతో ఎక్కుపెట్టి పెళ్లి కూతురిపైకి బాణం విసురుతారు.ఇప్పటికీ చైనాలోని ఒక తెగలో ఇలాంటి ఆచారం కొనసాగుతూనే ఉంది.అయితే బాణాలకు బదులుగా రబ్బరు బుల్లెట్లతో పెళ్తి కూతుర్ని కాల్చుతుంటారు.ఇలా చేయడం వల్ల తమ జీవితం సాఫీగా సాగుతుందని వారి నమ్మకం.

నవ్వాపుకోవడం కష్టమే కానీ తప్పదు.


కాంగోలో వినూత్న సంప్రదాయం ఉంది అదేంటంటే పెళ్లికొడుకు పెళ్లి కూతురు చాలా సీరియస్ గా ఉండాలి.అస్సలు నవ్వకూడదు… కష్టమే కానీ తప్పదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube