భారతదేశంలో ఏ నదిలోని నీరు స్వచ్ఛంగా ఉంటుందో తెలుసా..?!

మన భారతదేశంలో ప్రకృతి సంపదకు కొరత లేదు.భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాల నుండి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు దేశం మొత్తంలో ఎన్నో ప్రకృతి అందాల మనకు కనువిందు చేస్తాయి.

 Umngot River Of India Having Purest Water ,river, Crystal Clear River, Clear Riv-TeluguStop.com

ఇక మారుతున్న కాలంలో మానవుడు పురోగతి సాధించిన కొద్ది ప్రకృతి నాశనం అవుతుందని చెప్పవచ్చు.అయితే మన భారతదేశంలో ఉన్న నదులను కూడా పూజించే వారు ఎందరో ఉన్నారు.

ఇక మారుతున్న కాలంతో పాటు ఈ నదులన్నీ కూడా పూర్తిగా కాలుష్య కారకాలుగా మారిపోతున్న సంగతి మనం ప్రతి రోజూ గమనిస్తూనే ఉన్నాం.పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు అలాగే మానవ రాహిత్య చర్యలకు ఉత్తరాది నుండి దక్షిణనాన వరకు ఎన్నో నదులు కాలుష్యాన్ని నింపుకుని వాటి స్వచ్ఛతను పూర్తిగా కోల్పోయాయి.

దీంతో మనకు సుందరమైన నదులు చూడడానికి వీలు లేకుండా పోతోంది.అయితే వీటన్నింటికి భిన్నంగా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న నది చూడ చక్కని ప్రదేశంగా అందరిని ఆకట్టుకుంటుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మేఘాలయ రాష్ట్రం లోని తూర్పు జంతియ జిల్లాలో ఉన్న దాంకి అనే నగరం దగ్గర ఉన్న నది భారతదేశం లోనే స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తుంది.

ఆ నది పేరు ఉంగోట్.

Telugu Clear River, India, River, Meghalaya, Pure, Tourist Place, Umngot River,

ఈ నదిలో ప్రవహించే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి.అది ఎంతలా అంటే ఆ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ నది కింద ఉన్న రాళ్లు, చేపలు కూడా పైన ఉన్న వారికి స్పష్టంగా కనపడే అంతగా ఆ నదిలో నీరు స్వచ్ఛంగా ఉంటాయి.దీంతో ఈ నది పై ప్రయాణించడానికి భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి పర్యాటకులు రావడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ నదిలో పడవలో ప్రయాణిస్తుంటే అచ్చం గాల్లో తేలుతున్న అనుభూతిని పర్యాటకులు పొందుతున్నారు.ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ నది ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన నదిగా పేరు పొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube