కరోనా ఎమర్జెన్సీ చట్టాలు రద్దు .. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన నిర్ణయం

ద‌క్షిణాఫ్రికాలో గతేడాది న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.ముఖ్యంగా యూర‌ప్ దేశాల్లో గతంలో ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ రోజువారీ కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

 Uks Johnson Plans To Scrap Covid 19 Self Isolation Law , British Prime Minister-TeluguStop.com

దీంతో అక్కడి ఆస్పత్రులు రోగుల‌తో కిటకిటలాడుతున్నాయి.కోవిడ్‌కు చెక్‌ పెట్టేందుకు.

ప్రపంచ దేశాలు ఆంక్షల మంత్రం జపిస్తున్నాయి.ఈ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్న యూరప్‌లో జనవరి తొలి వారంలో 70 లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అంచనా.

యూరప్‌‌లోని 26 దేశాల్లో ఒక శాతం జనాభా ప్రతి వారం వైరస్ బారిన పడుతోంది.ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్ధ కుప్పకూలుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రానున్న రోజుల్లో వెస్టర్న్ యూరప్‌‌లోని సగం జనాభా కరోనా బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా .ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఆయన వున్నారు.చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వలన కోవిడ్ కేసులు తగ్గుతాయని భావించడం లేదని.ఇందుకు ప్రత్యామ్నాయంగా వైరస్‌ను కట్టడి చేసే విధంగా ప్రధాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే దేశంలో కోవిడ్ ఆంక్షలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం యూకేలో ఒమిక్రాన్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పటికే క్వారంటైన్ సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే కోవిడ్ మార్గదర్శకాలు మాత్రం దేశంలో యథావిధిగా అమల్లో వుంటాయని.

వీటిని ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాతో పాటు శిక్షలు తప్పవని ఓ నివేదిక పేర్కొంది.ఈ ప్రణాళికలు రాబోయే వారాల్లో అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు గత నెలలో ప్రవేశపెట్టిన ప్లాన్ బి కోవిడ్ 19 ఆంక్షలను కూడా జాన్సన్ ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు.

UKs Johnson Plans To Scrap Covid 19 Self Isolation Law , British Prime Minister Boris Johnson, Europe, Omicron, Kovid Emergency, UK, South Africa - Telugu Britishprime, Europe, Kovid Emergency, Omicron, Africa, Uksjohnson

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube