కొత్త వలసదారుల వల్లే లీసెస్టర్ అల్లర్లు.. యూకే హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్ వ్యాఖ్యలు

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆగస్ట్ 28న ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

 Uk's India-origin Home Secretary Suella Braverman Blames Leicester Riots On New-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.

దీనికి కారణం మీరంటే మీరేనంటూ ముస్లింలు, హిందూవులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

అయితే యూకే కొత్త హోంమంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త వలసలను నియంత్రించలేకపోవడం వల్లే లీసెస్టర్‌లో ఘర్షణలకు కారణమైందని ఆమె అభిప్రాయపడ్డారు.బర్మింగ్‌హామ్‌లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను లీసెస్టర్‌కు వెళ్లినప్పుడు అల్లర్లను పరిశీలించినట్లు ఆమె తెలిపారు.భిన్న సంస్కృతుల సమ్మేళనం మత సామరస్యానికి దారి తీస్తుందని సుయెల్లా పేర్కొన్నారు.

కానీ అక్కడ పెద్ద సంఖ్యలో కొత్త వారు ప్రవేశించడానికి అనుమతించడంలో వైఫల్యం కారణంగా అల్లర్లు చోటు చేసుకున్నాయని.ఇలాంటి వాటికి యూకేలో చోటు లేదని సుయెల్లా తేల్చిచెప్పారు.

ఇదే సమయంలో సరిహద్దుల్లో వలసలను నియంత్రించడం వల్ల దేశంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.సామూహిక , వేగవంతమైన వలసలు.

హౌసింగ్, పబ్లిక్ సర్వీసెస్, కమ్యూనిటీ సంబంధాలపై ఒత్తిడిని కలిగిస్తాయని చెప్పడం జెనోఫోబిక్ కాదని సుయెల్లా స్పష్టం చేశారు.

మరోవైపు .అల్లర్లపై దృష్టిపెట్టిన సుయెల్లా బ్రేవర్‌మాన్ గత నెలలో లీసెస్టర్‌లోని స్థానిక పోలీసు అధికారులు, హిందూ, ముస్లిం సంఘాల నాయకులతో భేటీ అయ్యారు.ఈ ఘటనలకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు.

తన పర్యటనకు సంబంధించి బ్రేవర్‌మాన్ ట్వీట్ చేశారు.పోలీసులు, స్థానిక కమ్యూనిటీ నాయకులతో శాంతిని, సామరస్యాన్ని పునరుద్ధరించడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించానని బ్రేవర్‌మాన్ తెలిపారు.

కమ్యూనిటీకి, పోలీసులకు మద్ధతు ఇచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని సుయెల్లా పేర్కొన్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని, శాంతిని నెలకొల్పేందుకు శ్రమిస్తున్న పోలీసులకు హోంమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube