భారతీయ విద్యార్థులకు తీపికబురు చెప్పిన బ్రిటన్ సర్కార్!

భారత్ లోని చాలా మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదవడం కల.అయితే అమెరికా చదువు విషయంలో ఆంక్షలు విధించటం, వీసా విషయంలో నిబంధనలు కఠినతరం చేయడం వల్ల విద్యార్థులకు అమెరికాకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 Uks Immigration Health Surcharge To Allow Indian Students Free Access To Nhs, In-TeluguStop.com

అదే సమయంలో బ్రిటన్ ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడానికి తమ దేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని గతంలో తెలిపింది.

బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అక్కడ మన దేశ విద్యార్థుల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 93 శాతం మంది విద్యార్థులు అధికంగా బ్రిటన్ లో చదువుతున్నారు.తాజాగా బ్రిటన్ సర్కార్ అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

బ్రిటన్ లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్(ఐహెచ్ఎస్) పే చేయడం ద్వారా వైద్య ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది.

ఎవరైతే ఐహెచ్ఎస్ చెల్లిస్తారో వారు ఉచితంగా తమ దేశం అందించే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని.

విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ అనుమతి కాలానికి తగిన విధంగా సర్ ఛార్జీలను చెల్లిస్తే సరిపోతుందని బ్రిటన్ సర్కార్ పేర్కొంది.ఐహెచ్ఎస్ చెల్లించిన వారికి ఎలాంటి సమస్యకైనా ఉచితంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది.

యూకే వీసాకు దరఖాస్తు చేసుకోవడంలో ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ ఒక భాగం.

ఐహెచ్ఎస్ ద్వారా ఎంచుకున్న ఆస్పత్రులలో చికిత్సతో పాటు అత్యవసర సేవలను, స్థానిక వైద్యుల సలహాలను పొందవచ్చు.

బ్రిటన్ స్టడీ గ్రూప్, ఈయూ ఎండీ జేమ్స్ పిట్‌మ్యాన్ యూకేను విదేశీ విద్య కోసం ఎంచుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.యూకే మొబిలిటీ వీసాల కొరకు 28 వేల రూపాయలు(£300) చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

మెరుగైన ఆరోగ్య సేవలు బ్రిటన్ లో లభిస్తాయని జేమ్స్ వెల్లడించారు.బ్రిటన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube