కోవిడ్ విజృంభిస్తుంటే విందులు.. నాకెవరూ చెప్పలేదు, అందుకే అలా: బ్రిటన్ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సహా పలువురు అధికారులు డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికారిక నివాసంలో విందుల్లో మునిగి తేలడం యూకే రాజకీయాలను వేడెక్కించింది.గతేడాది మేలో దేశంలో కఠిన లాక్‌డౌన్ అమల్లో వుండగా జరిగిన ఈ ఘటన బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది.

 Uks Boris Johnson Defies Calls To Quit As Ouster Bid Gathers Pace , Prime Minist-TeluguStop.com

దీనిపై స్వయంగా ఆయన క్షమాప

ణలు చెప్పినప్పటికీ వివాదానికి తెరపడటం లేదు.ఇందుకు గాను బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని స్పందించారు.ఆ పార్టీ జరుపుకోవడం కరోనా నిబంధనలకు విరుద్ధమని అధికారులెవరూ తనకు తెలియజేయలేదని తెలిపారు.

తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో తాము పనిచేస్తున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటారని బోరిస్ జాన్సన్ ఆకాంక్షించారు.

మరోవైపు డౌనింగ్‌ స్ట్రీట్‌లో పార్టీ గురించి ప్రధాని బోరిస్‌కు ముందే తెలుసని, తెలియదని అబద్ధం చెబుతూ ఎంపీలను తప్పుదోవ పట్టిస్తున్నారని బోరిస్‌ మాజీ సలహాదారు డామినిక్‌ కమింగ్స్‌ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి.

వీటిపైనా బోరిస్‌ స్పందించారు.తాను పార్టీకి హాజరైన మాట వాస్తవమే కానీ, అది నిబంధనలకు విరుద్ధమని తనకు తెలియదన్నారు.

ఎంపీలను తప్పుదోవ పట్టించినట్లుగా విచారణలో తేలితే రాజీనామా చేస్తారా.అని మీడియా ప్రశ్నించగా… నివేదిక వచ్చే వరకు చూద్దామని బోరిస్‌ జాన్సన్ బదులిచ్చారు.

కాగా.కరోనా బారినపడిన ప్రధాని బోరిస్ జాన్సన్ చావు అంచులదాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

కొన్ని రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన అనంతరం కోలుకున్నారు.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత జాన్సన్ కూడా సదరు పార్టీలో పాల్గొన్నట్లుగా గార్డియన్ ఫోటోను ప్రచురించింది.

భార్య క్యారీ, తన కుమారుడు విల్‌ఫ్రెడ్‌ని పట్టుకుని టెర్రస్‌పై వున్న టేబుల్ వద్ద వైన్ గ్లాస్‌తో ప్రధాని జాన్సన్ వున్నారు.వారికి దగ్గరిలో మరో నలుగురు వ్యక్తులున్న టేబుల్, దానికి కొంచెం దూరంలో మరికొందరు వైన్ బాటిళ్లతో నిల్చొన్నారు.

ఈ ఫోటోపై పెద్ద ఎత్తున దుమారం రేపడంతో ప్రధాని కార్యాలయం స్పందించింది.ఆ రోజు గార్డియన్‌లో జరిగింది పార్టీ కాదని.

స్టాఫ్ మీటింగ్ అని వివరణ ఇచ్చింది.

అలాగే 2020లోనూ కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేసింది బ్రిటన్‌.

కొన్ని నెలల పాటు నిబంధనల మధ్యనే ప్రజలు గడపాల్సి వచ్చింది.ప్రజలు గుమిగూడటంతో పాటు క్రిస్మస్‌ వేడుకలపైనా ఆంక్షలు విధించారు.

వాటిని అతిక్రమిస్తే జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ప్రభుత్వం.అటువంటి పరిస్థితుల్లోనే 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా అతిక్రమించి క్రిస్మస్‌ పార్టీ జరుపుకోవడం ఇటీవల పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

అక్కడితో ఆగకుండా ఆ పార్టీలో జరిగిన సంఘటనలను ప్రధాని కార్యాలయ సిబ్బంది నాలుగు రోజుల తర్వాత ఒక హాలులో మాట్లాడుకుంటూ జోకులు వేసుకున్నారు.ముఖ్యంగా ప్రభుత్వ ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ జోకులు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.

UKs Boris Johnson Defies Calls To Quit As Ouster Bid Gathers Pace , Prime Minister Of The United Kingdom Boris Johnson, Dominic Cummings, Carrie, Wilfred, Secretary Of State Press Alegra Sraton - Telugu Carrie, Dominic, Primekingdom, Secretarypress, Uksboris, Wilfred

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube