పలుకుబడి వాడండి.. రష్యాను నిలువరించండి: మరోసారి భారత్ సాయాన్ని కోరిన అమెరికా..!!!

ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పావులు కదుపుతున్నారు.తొలుత సైనిక దాడిగానే దీనిని ప్రకటించిన ఆయన.

 Ukraine Crisis Us Urges India To Use Influence With Russia , Usa, Albania, Ukrai-TeluguStop.com

తర్వాత మాత్రం మాట మార్చారు.ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని.

దాడులను ఇంకా ఉద్ధృతం చేయాలని రష్యా సేనలను ఆదేశించారు.అధినేత ఆదేశాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి రష్యా దళాలు.

అగ్రరాజ్యం అమెరికా సహా ఐరోపా సమాజం, నాటో దేశాలు పుతిన్‌ను నిలువరించేందుకు కిందా మీదా పడుతున్నాయి.ఇప్పటికే రష్యాపై పలు రకాల ఆంక్షలను విధించాయి పాశ్చాత్య దేశాలు.

అటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శనివారం రష్యాపై ఉక్రెయిన్ దాడిని ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

అమెరికా, అల్బేనియా సంయుక్తంగా రూపొందించిన ఈ తీర్మానానికి అనుకూలంగా పోలండ్‌, ఇటలీ, లక్సెంబర్గ్‌, న్యూజిలాండ్‌ సహా 11 దేశాలు ఓటు వేశాయి.భారత్, చైనా, యూఏఈ దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

అయితే రష్యా తనకున్న వీటో పవర్‌తో ఈ తీర్మానాన్ని అడ్డుకుంది.

అయితే ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా వుండటంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుత పరిస్ధితుల్లో పుతిన్‌ను అడ్డుకోవాలంటే మరిన్ని దేశాల మద్ధతు కావాలని అమెరికా భావిస్తోంది.అందులో తొలి దేశం భారత్.

అప్పటి సోవియట్ యూనియన్ నుంచి నేటి రష్యా వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.ఆర్ధిక, సామాజిక , రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్- రష్యా మైత్రీ బంధం కొనసాగుతోంది.

ఆయుధాలను ప్రస్తుతం మనమే ఉత్పత్తి చేసుకుంటున్నా… మన ఆయుధ సంపత్తిలో 50 శాతం రష్యా నుంచి దిగుమతి అవుతున్నాయి.గగనతల రక్షణ, న్యూక్లియర్ సబ్‌మైరెన్లు దిగుమతి ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.

ఈ ఒప్పందాల విలువ వేల కోట్ల పైమాటే.

ఈ నేపథ్యంలోనే పుతిన్‌ను నిలువరించగల సత్తా భారతదేశానికి ఉందని అమెరికా భావిస్తోంది.అయితే తమకు మద్ధతుగా ఇండియా రాకపోవడంతో వాషింగ్టన్ అసహనంతో వుంది.భద్రతా మండలిలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా వుండటం దీనికి మరింత ఆజ్యం పోసింది.

అయినప్పటికీ.అమెరికా పట్టువీడటం లేదు.

తన పలుకుబడి ద్వారా రష్యాను నియంత్రించాలని అగ్రరాజ్యం ఇండియాను కోరుతోంది.రష్యా- అమెరికాలతో భారత్ సత్సంబంధాల వల్ల.

ఉక్రెయిన్ సంక్షోభం ఇండో – యూఎస్ మధ్య సంబంధాలను దెబ్బతీసిందా అన్న ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు.మాస్కోతో న్యూఢిల్లీకి వున్న బంధంపై తమకు ఖచ్చితమైన అవగాహన వుందని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు వ్యతిరేకంగా పలుమార్లు ఉక్రెయిన్ ఓట్లు వేయగా.అనేక సందర్భాల్లో న్యూఢిల్లీకి మద్ధతుగా రష్యా తన వీటోను ఉపయోగించిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube