వైరల్: కిడ్నాపర్‌కే ఝలక్కినచ్చిన యూకేజీ పిల్లోడు!

ఈ మధ్య కాలంలో కిడ్నాపర్లు ( Kidnapper ) పేట్రేగిపోతున్నారు.ఈజీ మార్గాల్లో డబ్బుకోసం కొందరు కిడ్నాప్‌లు చేస్తే, మరికొంతమంది మాత్రం పగ, ప్రతీకారాలు అంటూ చిన్నారును కిడ్నాప్‌ చేసి చంపేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం.

 Ukg Boy Escaping From Kidnapper Viral Details, Ukg Kid, Kidnapper, Viral News, L-TeluguStop.com

అయితే ఇలాంటి కిడ్నాపర్ల గురించి పోలీసులు ఇంటరాగేట్ చేసి చెప్పిన విషయాలు ఏమంటే… వారి ఆలోచనలు చాలా క్రూరత్వంగా వుంటాయని, కిడ్నాప్ చేసే ముందు చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారని చెబుతూ వుంటారు.మరి అలాంటి కిడ్నాపర్లు ఎంతో ప్లాన్‌ వేసి.

స్కెచ్‌ గీసి కిడ్నాప్‌ చేస్తూంటారు.అందుకే వారినుండి తప్పించుకుకోవడం దాదాపు అసాధ్యం.

అయితే అలాంటి కిడ్నాపర్ కి ఝలక్ ఇచ్చాడు ఓ పిల్లాడు.ఆ పిల్లోడి తెగువకు ఆ దుండగుడు బకరా అయ్యాడు.దాంతో వెంటనే అక్కడ నుంచి జారుకున్నాడు.ఈ సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో( Chikkamagaluru ) జరిగినట్టు భోగట్టా.అక్కడ ఈ ఆదివారం సాయంత్రం 6గంటల 38నిమిషాలకు ఫుట్‌పాత్‌పై ఓ బాలుడు( Boy ) ఆడుకుంటూ ఉండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఓ దుండగుడు ఆ పిల్లోడి వైపు వేగంగా నడుచుకుంటూ వచ్చి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు.అతడిని అపహరించి భుజాలపై ఎత్తుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే ఇక్కడే ఊహించని మలుపు చోటుచేసుకుంది.

విషయం గ్రహించిన బాలుడు వెంటనే తేరుకొని కిడ్నాపర్ భుజం నుంచి అంతే స్పీడుగా కిందకి దూకుతాడు.దాంతో ఆ దుండగుడు ఆ బాలుడుపైన పడతాడు.విషయం తేడా కొడుతోంది అని భావించిన ఆ కిడ్నాపర్ అక్కడినుండి హుటాహుటిన పారిపోతాడు.

కాగా కిడ్నాపర్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్న యూకేజీ కుర్రాడు చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటన సీసీటీవీలో రికార్డవగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

నిండా ఆరేళ్లు కూడా నిండని చిన్నోడు.అలా అతడి నుంచి స్పాట్‌లోనే తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube