లేటు వయసులో ఘాటు ప్రేమ, ఒంటిపై నిప్పు తో లవ్ ప్రపోజ్!

లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే ఇదే నెమో.వయసు చూస్తే 52 ఏళ్లు,అలాంటి వ్యక్తి 48 ఏళ్ల మహిళ ను ఇష్టపడి ఆమెకు తన లవ్ ను ప్రపోజ్ చేయడం కోసం ఏకంగా ఒంటిపై మంటలు అంటించుకొని మరి ప్రపోజ్ చేశాడు.

 Uk Stuntman Lights Himself On Fire While Proposing To His Girlfriend, Girlfriend-TeluguStop.com

ఈ ఘటన యూకే లో చోటుచేసుకుంది.అతడు ఒక ఫైట్ మాస్టర్ అని, అందుకే ఈ రేంజ్ లో రిస్క్ చేసి మరి తన లవ్ ను ప్రపోజ్ చేశాడు .

సాధారణంగా టీనేజ్ లో ప్రేమలో పడితే ఎదో సాహసం చేసి తన లవ్ ను ప్రపోజ్ చేశారు అనుకోవచ్చు కానీ ఐదు పదుల వయసులో ఇలాంటి స్టంట్ చేసి మరి తన ప్రేమ ను ఎక్స్ ప్రెస్ చేయడం విశేషం.ఇలాంటి సాహసాలు సినిమాల్లో డూప్ లను పెట్టి చేస్తూ ఉంటారు.

కానీ ఈ ఫైట్ మాస్టర్ మాత్రం తన నిజ జీవితంలో తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఇలా సాహసం చేసి మరి తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేశాడు.సినిమాలు, సాహసాలు చేయడం తప్పించి మరొక ప్రపంచం తెలియని రికి అనే 52 ఏళ్ల ఫైట్ మాస్టర్, 48 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు.

ఆమెను ఎలాగైనా ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు.కానీ, ఎలా ప్రపోజ్ చేయాలో తెలియలేదు.తనకు తెలిసిన స్టంట్ విద్యనే నమ్ముకొని ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు.వెంటనే ఒంటికి మంట అంటించుకొని ఆ మంటలతో వెళ్లి తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు.

దీనితో రికీ ప్రపోజ్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయిన ఆ మహిళ అలా బొమ్మలా ఉండిపోయింది.చివరికి అతగాడి ప్రేమ ప్రపోజల్ కూడా ఒకే చెప్పక తప్పలేదు.దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో దర్శనమివ్వడం తో ఇవి కాస్త వైరల్ ఆ మారాయి.లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube