భారత సంతతి ఎంపీ నుంచి అవార్డ్ వెనక్కి.. కింగ్ ఛార్లెస్ ఆదేశాలు , ఎందుకంటే?

భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది.తనకు దక్కిన ప్రతిష్టాత్మక ‘‘కమాండర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సీబీఈ) ’’( Commander of the British Empire ) గౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

 Uk Revoked Cbe Honour Of British Indian Peer Rami Ranger , Commander Of The Brit-TeluguStop.com

ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమాల గురించి బహిరంగంగా విమర్శించే రేంజర్ తన గౌరవాన్ని తిరిగి పొందేందుకు గాను న్యాయపరమైన సమీక్ష, యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు చట్టపరమైన చర్యలను కొనసాగించే అవకాశం ఉంది.

భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనుకునే ఖలిస్తానీలకు( Khalistanis ) వ్యతిరేకంగా నిలబడినందుకు ఈ రోజు తాను నా సీబీఈ గౌరవాన్ని కోల్పోయానని ఓ అధికారిక ప్రకటనలో రేంజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

జప్తు కమిటీ నిర్ణయం బ్రిటీష్ ప్రజాస్వామ్యాన్ని , లా అమలును దెబ్బతీస్తుందన్నారు.ఈ తీర్పు ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని రేంజర్ హెచ్చరించారు.మనకు, మనదేశానికి హాని కలిగించాలనుకునే వారికి వ్యతిరేకంగా నిలబడినందుకు ఇది తనకు దక్కిన బహుమతి అంటూ రేంజర్ వాపోయారు.రేంజర్ ఎలాంటి నేరం చేయలేదని, ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆయన అధికారిక ప్రతినిధి వ్యాఖ్యానించారు.

Telugu Britishindian, Cbe, Khalistanis, Charlesiii, London Gazette, Ukrevoked-Te

జప్తు కమిటీ నిర్ణయం తర్వాత లార్డ్ రామి రేంజర్‌కి ( Lord Rami Ranger )ప్రకటించిన సీబీఈని రద్దు చేసినట్లుగా లండన్ గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్ III( King Charles III of Britain ) అధికారులను ఆదేశించారు.రేంజర్‌పై వచ్చిన ఫిర్యాదులను జప్తు కమిటీ విచారించినట్లుగా యూకే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.వీటిలో సౌతాల్ సిక్కు గురుద్వారా ట్రస్టీ గురించి చేసిన ట్వీట్, గుజరాత్ అల్లర్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇరికించేలా బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై చేసిన విమర్శలు, జర్నలిస్టు పూనమ్ జోషితో ఆన్‌లైన్ వివాదం తదితర అంశాలు ఉన్నాయి.

Telugu Britishindian, Cbe, Khalistanis, Charlesiii, London Gazette, Ukrevoked-Te

వ్యాపారం, కమ్యూనిటీ శ్రేయస్సు కోసం చేసిన కృషికి గాను 2016లో సీబీఈతో లార్డ్ రామి రేంజర్‌ను సత్కరించారు.2019లో థెరిసా మే రాజీనామా తర్వాత ఆయనను పీర్‌గా నియమించారు.రేంజర్ కంపెనీ .బ్రిటన్‌ను దాదాపు 130 దేశాలతో కనెక్ట్ చేయడానికి సహాయపడింది.ఎన్నో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube