బ్రిటన్ లో “భారతీయ డాక్టర్ల” చెరగని ముద్ర

దేశ విదేశాలలో వైద్య విధానంలో కానీ, కంప్యూటర్ రంగంలో గాని ఎంతో ముందుకు వెళ్ళాయి అభివృద్ధి చెందాయి అయితే ప్రతీ దేశ అభివృద్ధి పై తప్పకుండా భారతీయుల ప్రభావం ఉంటుంది.తప్పకుండా భారతీయులు ఆయా దేశాల అభివృద్దిలో ఎప్పుడు భాగస్వాములుగా ఉంటూనే ఉంటారు.

 Uk Praises Indian Doctors-TeluguStop.com

అంతేకాదు అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటూ ఉంటారు.తాజాగా బ్రిటన్ భారతీయులు చేసిన సేవలు మర్చిపోలేనివి అంటూ పాతజ్ఞాపకాలని నేమరువేసుకున్నాయి తమ వైద్య వ్యవస్థలో భారతీయుల చేసిన మార్పులని కొనియాడారు.వివరాలలోకి వెళ్తే

ఎన్నో దశాబ్దాలుగా భారతీయ డాక్టర్లు బ్రిటన్‌ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంలో అందిస్తున్న తీరును బ్రిటన్‌ సమాజం ప్రశంసించింది…గౌరవించింది.అంతేకాదు వారు చేసిన సేవలని గుర్తిస్తూ ఎన్‌హెచ్‌ఎస్‌ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జనరల్‌ ప్రాక్టీషనర్స్‌(ఆర్‌సీజీపీ)లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.దక్షిణాసియా నుంచి ప్రత్యేకించి భారత్‌ నుంచి వచ్చిన డాక్టర్లు బ్రిటన్‌లో విశేష సేవలందించిన తీరుని అభినందించారు.

ఇప్పుడున్న పరిస్థితికి కి పూర్తీ భిన్నంగా అప్పట్లో కఠోర శ్రమ, అంకిత భావంతో వినూత్నంగా సేవలందించారని వారు ఎన్నో అద్భుతమైన సవాళ్లను ఎదుర్కొన్నారని ఆర్‌సీజీపీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మయూర్‌ లఖానీ ప్రశంసించారు 1980 నాటికి ఎన్‌హెచ్‌ఎ్‌సలోని 160 డాక్టర్లు భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చినవారేనని ‘మైగ్రెంట్‌ ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ది ఎన్‌హెచ్‌ఎస్‌’ అనే పుస్తకంలో వివరించారు.

బ్రిటిష్‌ వైద్యరంగంపై భారత్‌ నుంచి వచ్చిన వైద్యులు తమదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు భారత్‌లో పటేల్‌ అనే ఇంటిపేరు ఎంత సాధారణమో బ్రిటన్‌లో స్మిత్‌ అనే ఇంటిపేరు కూడా అంతే సాధారణం…అయితే ప్రస్తుతం జనరల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ లో స్మిత్‌ అనే ఇంటిపేరున్నవారు 1,750 మంది ఉండగా…పటేల్‌ ఇంటిపేరుతో 1,724 మంది ఉండటం విశేషం.భారతీయ డాక్టర్ల సేవలు గుర్తించి ఏకంగా ఒక వేడుకని జరపడం ఎంతో గర్వకారణంగా ఉందని ఎన్నారైలు భారతీయులు బ్రిటన్ దేశాన్ని ప్రసంసిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube