ఆన్‌లైన్‌లో భాంగ్రా సెషన్లు: భారత సంతతి డ్యాన్సర్‌కు యూకే ప్రధాని ప్రశంసలు  

UK PM Boris Johnson Honours Indian-Origin Dancer , Online Bhangra Classes, Lockdown, Bhangra Dance, Point of Light, UK - Telugu Bhangra Dance, Lockdown, Online Bhangra Classes, Point Of Light, Uk, Uk Pm Boris Johnson Honours Indian-origin Dancer

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశ ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.అలాగే స్వచ్చంధ సంస్థలు, సెలబ్రిటీలు సైతం తమకు తోచిన విధంగా అవగాహన కల్పించడం, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

 Uk Pm Boris Johnson Online Bhangra Classes Indian Origin Dancer

ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఆన్‌లైన్‌లో ఉచితంగా భాంగ్రా సైజ్ సెషన్లు నిర్వహించాడో భారత సంతతి డ్యాన్సర్.ఆయన చేస్తున్న మంచి పనికి ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసలు దక్కాయి.

యూకేలో స్థిరపడిన రాజీవ్ గుప్తా అనే భారత సంతతి డ్యాన్సర్ లాక్‌డౌన్‌లో ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగా తనకు తెలిసిన భాంగ్రా డ్యాన్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తూ.

ఆన్‌లైన్‌లో భాంగ్రా సెషన్లు: భారత సంతతి డ్యాన్సర్‌కు యూకే ప్రధాని ప్రశంసలు-Telugu NRI-Telugu Tollywood Photo Image

క్లాసులు చెప్పేవారు.ఈ విషయం యూకే ప్రధాని దృష్టికి వెళ్లడంతో ఆయన రాజీవ్‌ను అభినందిస్తూ లేఖ రాశారు.

‘‘ మీ ఆన్‌లైన్ భాంగ్రా క్లాసుల ద్వారా లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమైన ప్రజల్లో శక్తిని నింపుతున్నారని కొనియాడారు.ప్రజలు ఆరోగ్యంగా, ధృడంగా ఉండటానికి ఉపయోగపడుతున్నాయని ప్రధాని చెప్పారు.

ఈ క్లిష్ట సమయంలో మీరు చాలా మందికి ‘‘ పాయింట్ ఆఫ్ లైట్’’గా నిలిచారని జాన్సన్ లేఖలో పేర్కొన్నారు.సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న వారిని యూకేలో ‘ పాయింట్ ఆఫ్ లైట్’ పేరుతో గౌరవిస్తారు.

ప్రధాని లేఖపై రాజీవ్ స్పందించారు.‘‘ మనం ఉల్లాసంగా, పాజిటివ్‌గా, శక్తివంతంగా ఉండటానికి భాంగ్రా డ్యాన్స్ సాయం చేస్తుందని తాను నమ్ముతానన్నారు.తన సెషన్ల ద్వారా ప్రజలకు సాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు.కాగా రాజీవ్ గుప్తా గత 15 సంవత్సరాలుగా యూకేలో భాంగ్రా డ్యాన్స్ తరగతులు నిర్వహిస్తున్నారు.మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లలో రెగ్యులర్ డ్యాన్స్ ఫిట్‌నెస్ తరగతులను నిర్వహిస్తున్నారు.2012లో లండన్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో రాజీవ్ ప్రదర్శన ఇచ్చారు.

#Lockdown #Bhangra Dance #Point Of Light #Uk

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uk Pm Boris Johnson Online Bhangra Classes Indian Origin Dancer Related Telugu News,Photos/Pics,Images..