పాకిస్తాన్‌పై టీమిండియా విజయం.. యూకేలో హిందువులే టార్గెట్‌గా అల్లరి మూకల దాడులు

భారత్‌లోని కొందరు దేశద్రోహులు పాకిస్తాన్‌కు మద్ధతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.క్రికెట్ సహా పలు క్రీడల్లో ఇరుదేశాలు తలపడినప్పడు పాకిస్తాన్ గెలిస్తే భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Uk: Pakistan-origin Youths' Target Hindu Areas In Leicester After Team India Won-TeluguStop.com

ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.అయితే ఇది మనదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా జరుగుతుండటం దురదృష్టకరం.

తాజాగా కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆగస్ట్ 28న ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఠాలు అల్లర్లను ప్రోత్సహిస్తూ హిందువులపై దాడులకు దిగతున్నాయని మానవ హక్కుల కార్యకర్త రష్మీ సమంత్ ట్వీట్ చేశారు.

అమాయక హిందువులను వారి ఇళ్ల వద్దే టార్గెట్ చేస్తూ.భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారి ఆస్తులను సైతం ధ్వంసం చేశారని ఆమె తెలిపారు.లీసెస్టర్‌లోని పాక్ ముస్లింలు హిందూ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారని మరొకరు ట్వీట్ చేశారు.మత చిహ్నాలను అపవిత్రం చేస్తున్నారని.

జాత్యహంకార దూషణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పోలీస్, లీసెస్టర్ సిటీ కౌన్సిల్‌కు చెందిన ప్రతినిధులతో ఉద్రిక్తతలకు చెక్ పెట్టడానికి మంగళవారం అత్యవసర సమావేశం జరిగింది.అయితే అప్పటి నుంచి మరిన్ని దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ప్రతినిధి సులేమాన్ నాగ్డి మాట్లాడుతూ.

ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడానికి, సమాజానికి భరోసా ఇవ్వడానికి పోలీసులు శ్రమిస్తున్నారని చెప్పారు.సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా జాగ్రత్తగా వుండాలని ఆయన ప్రజలకు సూచించారు.

తాను దాడులకు సంంధించిన నివేదికలు, వీడియోలను చూశానని, అయితే వీటిలో కొన్ని పాత సంఘటనలు కావొచ్చని సులేమాన్ అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube