యూకే వీసాల కోసం గ్రాడ్యుయేట్ స్థాయి అర్హతలు కలిగిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల భారతీయుల నుంచి బ్రిటీష్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.‘‘యూకే – ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్’’ కింద సెకండ్ బ్యాలెట్‌ను ప్రారంభించింది.జూలై 27న మధ్యాహ్నం 1.30 గంటలతో సెకండ్ బ్యాలెట్ ముగియనుంది.ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్ ట్వీట్ చేసింది.ఈ స్కీమ్ కింద భారతీయ యువకులకు రెండేళ్ల వరకు యూకేలో నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
2023 సంవత్సరానికి గాను ఈ పథకం కింద మొత్తం 3,000 వీసాలు అందుబాటులో వున్నాయి.ఫిబ్రవరిలో విడుదలైన ఫస్ట్ బ్యాలెట్‌లో ఎక్కువ వీసాలు ఇచ్చినట్లు యూకే వీసాస్ అండ్ ఇమ్మిగ్రేషన్( UK Visas Immigration ) (యూకేవీఐ) తెలిపింది.
వీసా దరఖాస్తుకు 259 పౌండ్లు, ఆరోగ్య సంరక్షణ సర్‌ఛార్జ్ కింద 940 పౌండ్లు, వ్యక్తిగత పొదుపు కింద 2530 పౌండ్లు వున్నట్లు దరఖాస్తుదారుడు చూపించాలి.కాగా.గతేడాది నవంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ), బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ( Prime Minister Rishi Sunak )మధ్య ఈ స్కీమ్‌కు సంబంధించి సంతకాలు జరిగాయి.18 నుంచి 30 సంవత్సరాల వయసున్న భారత్- బ్రిటన్ పౌరులు ఏ దేశంలోనైనా కొంతకాలం పాటు నివసించడానికి , పనిచేసుకోవడానికి ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది.ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు గ్రాడ్యుయేట్ డిగ్రీ, వారి బసకు అండగా నిలవాలని ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది భారత్ కూడా యూకే విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తుదారులు తమ వివరాలను పూర్తి చేయడంతో పాటు 720 పౌండ్ల రుసుము చెల్లించాలని అప్పట్లో ఇండియన్ హైకమీషన్ వెబ్‌సైట్‌లో( Indian High Commission ) తెలిపింది.“ఈ 1” వీసా కింద దరఖాస్తును ప్రాసెస్ చేస్తామని.వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వీసా సర్వీస్ ప్రొవైడర్ ఈ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది.అలాగే ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తును సమర్పించే సమయంలో కనీసం 30 రోజులు పాటు బ్యాంక్‌లో వుంచిన 2,50,000కు సమానమైన నిధులను చూపించాల్సి వుంటుందని పేర్కొంది.
దరఖాస్తులకు అంగీకారం లభించిన వారు భారత్‌లో ఉపాధి పొందవచ్చు.అయితే రక్షణ, టెలికాం, స్పేస్ టెక్, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు, పౌర విమానయానం, మానవ హక్కుల వంటి రంగాలు ఈ స్కీమ్ పరిధిలోకి రావని కమీషన్ వెల్లడించింది.కొత్త వీసాపై భారత్‌కు వచ్చేవారు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ లేదా ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి.