బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. చర్చిలోనే ఘాతుకం, కత్తితో పొడిచి చంపిన నిందితుడు

Uk Mp David Amess Dies After Being Stabbed Multiple Time

పవిత్రమైన చర్చి ఆవరణలోనే బ్రిటన్ ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపింది.

 Uk Mp David Amess Dies After Being Stabbed Multiple Time-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడిచేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.తీవ్ర రక్తస్రావమైన ఎంపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ డేవిడ్ ప్రాణాలు విడిచారు.

 Uk Mp David Amess Dies After Being Stabbed Multiple Time-బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. చర్చిలోనే ఘాతుకం, కత్తితో పొడిచి చంపిన నిందితుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.

మరోవైపు మెట్రోపాలిటిన్ పోలీసులు డేవిడ్ హత్య వెనుక ఉగ్ర కోణం వుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా ఇస్లామిక్ తీవ్రవాదులు దీని వెనుక ఉన్నారని అధికారులు భావిస్తున్నారు.పోలీసులు అరెస్ట్ చేసిన 25 ఏళ్ల అనుమానితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.బ్రిటీష్ మీడియా కథనాలను బట్టి అనుమానితుడు సోమాలియా సంతతి బ్రిటీష్ జాతీయుడిగా తెలుస్తోంది.స్పెషలిస్ట్ కౌంటర్ టెర్రరిజం నుంచి అధికారులు దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

కాగా, అమీస్ 1983 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు.ఎసెక్స్‌‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జంతు సమస్యలతోపాటు, మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు.డేవిడ్‌ అమీస్‌ మృతిపై సహచర ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ ఘటనను ‘‘ తీవ్ర దిగ్భ్రాంతికరం’’గా అభివర్ణించారు.

Telugu Britain Mp, David, David Amis, Labor Keer, Meet Mp, Metropolitan, Mp Joe Cox, Ukmp-Telugu NRI

గతంలోనూ బ్రిటన్‌లో ఎంపీలపై దాడులు జరిగాయి.2016 బ్రెగ్జిట్ సమయంలో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్‌ కాల్చివేతకు గురయ్యారు.2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్‌పై దాడిచేసిన దుండగులు ఆయనను కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు.2000వ సంవత్సరంలో లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ నీగెల్ జోన్స్‌పై దాడి జరిగింది.జులై 30, 1990లో కన్జర్వేటివ్ ఎంపీ ఇయాన్ గౌ కారు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

#Meet MP #Metropolitan #Labor Keer #Britain MP #David

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube