కొంపముంచిన పటేల్ ఐక్యతా విగ్రహం..! కేంద్రానికి అనుకోని ట్విస్ట్.! వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారా.?  

‘స్టాట్యూ ఆఫ్ యునిటీ’ పేరుతో ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వానికి 3000 కోట్లు ఖర్చయింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఎంపీ పీటర్ బోన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పటేల్ విగ్రహం ఏర్పాటును అర్థంలేని చర్యగా ఆయన అభివర్ణించారు. బ్రిటన్ నుంచి 1.17 బిలియన్ పౌండ్స్ ఆర్థిక సాయంగా పొంది.. 330 మిలియన్ పౌండ్లను విగ్రహం నిర్మాణానికి వెచ్చించడమనేది పనికిరాని చర్య అని తెలిపారు.

UK MP Calls Idea Of Building Statue Unity Nonsense-

UK MP Calls Idea Of Building Statue Of Unity Nonsense

‘2000 వేల టన్నుల విగ్రహం నిర్మాణం కోసం ఇండియా రూ.3000 కోట్లను సులభంగా ఖర్చు చేయగలిగినప్పుడు.. మిగతా ప్రాజెక్టులకు బ్రిటన్ సాయం అందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నా’’ అని తెలిపారు. ఈయన వాదనను మరికొందరు బ్రిటన్ ఎంపీలు కూడా సమర్ధించారు. ‘‘బ్రిటన్ ఇండియాకు గత ఐదేళ్లుగా సుమారు 1.17 బిలియన్ పౌండ్స్ (భారత కరెన్సీ ప్రకారం రూ.9,492 కోట్లు) ఆర్థిక సాయంగా అందించింది. ఇండియాలో రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, మహిళ హక్కులు వంటి వివిధ సామాజిక కార్యక్రమాల కోసం బ్రిటన్ ఈ సాయాన్ని అందిస్తోంది’’ అని తెలిపారు. ”

UK MP Calls Idea Of Building Statue Unity Nonsense-

ఇండియాలో కోట్లాది మంది పేదరికంతో కొట్టిమిట్టాడుతున్నారని, వారి సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వం ఇలా విగ్రహాలకు నిధులు దారపోయడం మంచి పరిణామం కాదని చెబుతున్నారు. మరి, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.