అయ్యో పాపం.. అది అతని ఇంటిపేరని చెబుతున్న నమ్మట్లేదట.. అసలు విషయం ఏమిటంటే..!  

UK Man With \'Korona\' Surname Must Carrying ID Card, ID Card, UK man, Korona Sur name, Jimmy Korona,Pandemic joke, hospital, Surname - Telugu Hospital, Id Card, Jimmy Korona, Korona Sur Name, Pandemic Joke, Surname, Uk Man, Uk Man With \\'korona\\' Surname Must Carrying Id Card

ప్రతి ఒక్క మనిషికి ఇంటిపేరు ఉండడం సహజం.అయితే ఆ ఇంటి పేర్లు కొన్ని వినడానికి చాలా తమాషా గా ఉండడం గమనిస్తూనే ఉంటాం.

TeluguStop.com - Uk Man Korona Surname Pandemic Joke Id Card

అందులో మన స్నేహితులకు గాని ఉంటే వారి ఇంటి పేరు వెరైటీ గా అనిపిస్తే వారిని చాలా వరకు అసలు పేరుని పక్కన ఇంటి పేరుతో మాత్రమే తమాషాగా పిలుస్తూ ఉండటం గమనిస్తూనే ఉంటాం.అయితే, తాజాగా ఓ వ్యక్తికి తన ఇంటి పేరుతో తెగ బాధపడిపోతున్నాడు.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - అయ్యో పాపం.. అది అతని ఇంటిపేరని చెబుతున్న నమ్మట్లేదట.. అసలు విషయం ఏమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

జర్మనీ దేశ రాజధాని బెర్లిన్ లో ఓ 38 సంవత్సరాల ఉన్న వ్యక్తికి తన ఇంటి పేరుతో అనేక ఇబ్బందులు పడుతున్నాడు.

దానికి కారణం కరోనా వైరస్.అసలు అతని ఇంటి పేరుకి కరోనా వైరస్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నాం అండి.అతని పేరు జిమ్మీ కరోనా.

కరోనా అనేది ఆయన ఇంటి పేరు.ఇకపోతే కరోనా వైరస్ వ్యాధి మొదలైనప్పటి నుంచి అతడు ఎవరి వద్ద కూడా తన ఇంటి పేరు చెప్పిన ఆ విషయంలో జోక్ వేయొద్దని అతనిని అంటున్నారట.

చివరాఖరికి తన పేరును ఐడి కార్డు ద్వారా చూపించాకే దానిని నమ్ముతున్నారట.జిమ్మి కరోనా ఓ నిర్మాణ రంగ సంస్థ కార్మికుడు.

రెండో ప్రపంచ యుద్ధంలో నిర్బంధంగా మారి బయటపడిన జోసెఫ్ కరోనా మనవడు ఈ జిమ్మీ కరోనా.అయితే తాజాగా జిమ్మీ కరోనా తన భార్య గర్భవతి కావడంతో ప్రసవం చేయించేందుకు హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు.

అయితే అక్కడ అ సిబ్బంది ఆయన పేరు అడగగా అతను జిమ్మీ కరోనా అని చెప్పడంతో వారు అసలు నమ్మ లేదట.తన పేరు అదేనని ఎంత మొత్తుకొని చెప్పినా హాస్పిటల్ ఉద్యోగులు నిజం చెప్పండి సార్ అని తెగ బతిమాలడం జరిగిందట.

అయితే చివరికి ఆయన చేసేది ఏమీ లేక తన వాలెట్ నుంచి తన ఐడి కార్డు తీసి చూపించడంతో వారు చివరికి జిమ్మి కరోనా అని వారి రికార్డుల్లో చేర్చుకున్నారు.కేవలం ఆ ఒక్క చోట మాత్రమే కాదట.

అతడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమస్య జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.పబ్, బార్లు, ఫుడ్ డెలివరీ ఇలా ఏ విషయంలో అయినా సరే తన ఇంటిపేరు తెగ సమస్యగా మారిపోయింది అని అతడు వాపోతున్నాడు.

చివరాకరికి తన గుర్తింపు కార్డు చూపించే వరకు కూడా తనని ఎవరు నమ్మట్లేదని చెప్పుకొచ్చాడు.తనతో పాటు తన ఐడి కార్డు లేకుంటే చివరికి తనను ఎవరు నమ్మేలాలేరని జిమ్మీ కరోనా తెగ బాధపడిపోతున్నాడు.

#ID Card #Korona Sur Name #Surname #UK Man #Hospital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uk Man Korona Surname Pandemic Joke Id Card Related Telugu News,Photos/Pics,Images..