బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ విజయం: లాభాల్లో ఇండో-యూకే కంపెనీల షేర్లు

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.యూరోపియన్ యూనియన్ నుంచి యూకే తప్పుకోవాలనే తన నిర్ణయానికి ప్రజల మద్ధతు తెలిపారని జాన్సన్ ఉత్సాహంతో ఉన్నారు.

 Uk Linked Indian Firms That Stand To Gain From Johnsons Win-TeluguStop.com

ఇదే సమయంలో యూకే‌తో సంబంధం ఉన్న భారతీయ కంపెనీలకు సైతం ఆయన విజయం పెద్ద ఊరటను ఇచ్చింది.ముఖ్యంగా ఆటో, ఐటీ పరిశ్రమ వర్గాలకు జాన్సన్ ఎన్నిక మంచి ఉపశమనమని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా జాన్సన్ ఖచ్చితంగా బ్రెగ్జిట్‌పై నిర్ణయం తీసుకుంటారని.గత మూడేళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారం వ్యాపార వర్గాల గొంతుపై కత్తిలా వేలాడుతోందని ఐఐఎఫ్ఎల్‌లోని ఈవీపీ-మార్కెట్స్ విభాగానికి చెందిన సంజీవ్ భాసిన్ అభిప్రాయపడ్డారు.

జాన్సన్ విజయం టాటా మోటార్స్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.యూకేలో వ్యాపారం చేస్తున్న మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్ వంటి ఇతర ఓఈఎంలకు ఆయన విజయం మేలు కలిగిస్తుందని భాసిన్ వెల్లడించారు.

Telugu Boris Johnson, European, Uk General-

టాటా మోటార్స్ షేర్లు, యూకే నుంచి 16 శాతం ఆదాయాన్ని సంపాదిస్తున్నాయని.దాని అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్‌‌ శుక్రవారం మధ్యాహ్నం ట్రేడ్‌లో 3 శాతం లాభపడింది.ఇది ముందు రోజుతో పోలిస్తే 7 శాతం లాభాన్ని నమోదు చేసింది.ఇదే సమయంలో భారత్ ఫోర్జ్ 4 శాతం, మదర్సన్ సుమి 3 శాతం లాభపడ్డాయి.

షేర్ ఖాన్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు సంజీవ్ హోటా మాట్లాడుతూ… యూకేతో సంబంధం వున్న కంపెనీల స్టాక్‌లను జాన్సన్ విజయం ప్రభావితం చేస్తుందన్నారు.

Telugu Boris Johnson, European, Uk General-

ఈ వార్తలను అనుసరించి ఐటీ ప్యాక్ ఆకుపచ్చ రంగులో ట్రేడవుతోంది.టాటా ఎల్క్సీ, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాభాలతో నిఫ్టీ ఐటీ 0.93 శాతం పెరిగింది.నిఫ్టీ ఆటో 1.33 శాతం పెరిగింది.అమెరికా డాలరుతో పోలీస్తే రూపాయి 14 పైసలు లాభం పొందింది.అయితే బోరిస్ జాన్సన్ విజయం వాణిజ్యపరంగా కొన్ని ఇబ్బందులను సైతం తీసుకువస్తుందని ప్రభుదాస్ లిల్లాధర్ సీఈవో, చీఫ్ పొర్ట్‌ఫోలియో మేనేజర్ అజయ్ బోడ్కే అభిప్రాయపడ్డారు.

జేఎల్ఆర్ లాంటి సంస్థల ఉత్పత్తి యూనిట్లు యూకేలో ఉన్నాయని.ఇదే సమయంలో చాలా మంది విక్రేతలు ఐరోపా ఖండంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారన్న సంగతిని మరచిపోవద్దన్నారు.అందువల్ల వస్తువుల రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అజయ్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube