పాయింట్స్ బేస్డ్ వీసా సిస్టమ్‌ను తెచ్చిన యూకే: స్కిల్స్ లేకపోతే ‘‘నో వీసా’’

భారత దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు గాను బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా పాయింట్స్ బేసిడ్ వీసా సిస్టమ్‌ను ప్రారంభించింది.తక్కువ నైపుణ్యం వున్న కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు యూకే హోంశాఖ సెక్రటరీ ప్రీతి పటేల్ ప్రకటించారు.

 Uk Launches New Points Based Visa System-TeluguStop.com

గత నెలలో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగి, ట్రాన్సిషన్ పీరియడ్ ముగిసే సమయానికి అంటే 2021 జనవరి 1 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది.

ఈయూ, భారత్, యూరోపియన్ యూనియనేతర దేశాలకు సమానంగా వర్తించే కొత్త పోస్ట్ బ్రెక్సిట్ విధానంలో నిర్ధిష్ట నైపుణ్యాలు, అర్హతలు, జీతాలు, ఉద్యోగాలకు పాయింట్లను కేటాయిస్తారు.

తగినంత పాయింట్లు సాధించినవారికి మాత్రమే వీసాలు ఇవ్వబడతాయి.చౌకగా లభించే వలస కార్మికులపై దేశం ఆధారపడటాన్ని అంతం చేయడానికి, కఠినమైన భద్రతతో మొత్తం వలసల స్థాయిని తగ్గించడానికి బ్రెక్సిట్‌పై 2016లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

ఈ కొత్త సింగిల్ గ్లోబల్ సిస్టమ్‌ ఈయూ, ఈయూ యేతర పౌరులను సమానంగా చూస్తుంది.శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యావేత్తలతో సహా అత్యున్నత నైపుణ్యాలు, ప్రతిభ వున్న వారికి ఈ విధానం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హోంశాఖ కార్యాలయం తెలిపింది.

Telugu Britan, Scheme, Telugu Nri, Uklaunches, Visa System-Telugu NRI

అలాగే గ్లోబల్ టాలెంట్ స్కీమ్ ఇది శుక్రవారం నుంచి అమలులోకి రానున్న ఫాస్ట్ ట్రాక్ వీసా.ఇది 2021 నుంచి ఈయూ పౌరులకు కూడా వర్తిస్తుంది.అధిక నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఎలాంటి జాబ్ ఆఫర్ లేకుండా యూకేలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది.

ఇక పాయింట్ బేస్డ్ వీసా సిస్టమ్‌ విషయానికి వస్తే నైపుణ్యం కలిగిన కార్మికులు బ్రిటన్‌లో పనిచేయగలిగేలా నిర్ధిష్ట నైపుణ్యాలు, ఇంగ్లీష్ మాట్లాడే సామర్ద్యంతో సహా అనేక సంబంధిత ప్రమాణాలను కలిగి ఉండాలి.

దరఖాస్తుదారులందరికీ జాబ్ ఆఫర్ ఉండాలి.మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా, కనీస వేతన పరిమితి 25,600 పౌండ్లు ఉండాలి.

Telugu Britan, Scheme, Telugu Nri, Uklaunches, Visa System-Telugu NRI

డిసెంబర్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్కువ నైపుణ్యం కలిగిన వారికి యూకేలో ప్రవేశం ఉండదు.ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లో ఉన్న శ్రామికశక్తిలో 70 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరాలను తీర్చలేరని అంచనా.స్టూడెంట్ వీసాలను కూడా పాయింట్ల ఆధారిత వ్యవస్థ కిందకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.యూకేలో చదువుకోవాలనుకునే వారు తమకు ఇష్టమైన విద్యా సంస్థ నుంచి ఆఫర్ లెటర్, విద్యను అభ్యసించగల ఆర్ధిక స్తోమతతోపాటు ఇంగ్లీష్ మాట్లాడగలమని నిరూపించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube