యూకే : భర్తేమో డ్రగ్స్ డీలర్.. భారత సంతతి మహిళా పోలీస్‌పై అధికారుల వేటు

గత నెలలో విధుల నుంచి తొలగించబడిన భారత సంతతికి చెందిన మెట్ పోలీస్ అధికారి రస్వీందర్ సింగ్. తన భర్త డ్రగ్ డీలర్ అని తనకు తెలియదని పేర్కొంది.

 Uk Indian-origin Policewoman Fired After Her Husband Is Found To Be A Drug Lord-TeluguStop.com

మాదకద్రవ్యాల వ్యాపారి జూలియన్ అగల్లియుతో విలాసవంతమైన జీవనం సాగించిన మాజీ మోడల్, కానిస్టేబుల్ రస్వీందర్ అగల్లియు… ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు చెఫ్‌గా పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించిందని ఈవినింగ్ స్టాండర్డ్ నివేదించింది.ఈ జంట నెలకు 5,000 పౌండ్లు అద్దెగా చెల్లించి విలాసవంతమైన ఇంటిలో నివసించేవారు.

అలాగే 70 వేల పౌండ్ల ఆడి, డిజైనర్ దుస్తులు, నార్త్ లండన్‌లోని బార్నెట్‌లో అప్ మార్కెట్‌ హాడ్లీ వుడ్ ఎన్‌క్లేవ్‌లో వీరికి ఓ ఇల్లు కూడా వుంది.

విచారణ సందర్భంగా రస్వీందర్ మాట్లాడుతూ.

వారానికి 1,000 నుంచి 4,000 పౌండ్ల మధ్య తన భర్త నగదు రూపంలో సంపాదించినందున పన్నులు చెల్లించలేదని ఆమె ధర్మాసనానికి తెలిపారు.అయితే ట్రిబ్యునల్ మాత్రం రస్వీందర్ వాదనలను తిరస్కరించింది.

అగల్లియు ఇంట్లో మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే మార్గాలు స్పష్టంగా కనిపించాయని వ్యాఖ్యానించింది.అయితే విలాసవంతమైన జీవనశైలి కారణంగా జూలియన్ సంపాదన గురించి ఆమెకు అనుమానం వచ్చే వుండాలి కదా అని ధర్మాసనం పేర్కొంది.

అలాగే తన ఇంట్లో ఎవరో ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ పెట్టారంటూ రస్వీందర్ చేసిన వాదనలను కూడా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.

Telugu Drug Dealer, Indianorigin, Julian Agalliu, Rasvinder Singh, London-Telugu

2020లో నార్త్ లండన్‌లోని రస్వీందర్ ఇంటిపై రెండుసార్లు జరిపిన దాడుల్లో పోలీసులు 100 కిలోల ప్యాకేజీలు, కొకైన్ పొట్లాలు, మాదక ద్రవ్యాల సరఫరాకి సంబంధించిన ఆధారాలు, తుపాకీ అగ్రిమెంట్‌కి సంబంధించిన సందేశాలను స్వాధీనం చేసుకున్నారు.దంపతుల మంచం కింద వున్న లూయిస్ విట్టన్ బాక్స్‌లో డ్రగ్స్‌ను.27,000 పౌండ్ల నగదును, ఇంటి ప్రాంగణంలో గంజాయి సాగును కూడా కనుగొన్నారు.ఆ వెంటనే ఉన్నతాధికారులు రస్వీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి వూల్విచ్ క్రౌన్ కోర్టులో దోషిగా తేలాడు.ఫిబ్రవరి 9, 2023న అతనికి శిక్షను ఖరారు చేయనుంది న్యాయస్థానం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube