యూకే : నైన్ గ్రూప్ హోటల్స్ సీఈవో వివేక్ చద్దా (33) ఆకస్మిక మృతి.. భారతీయ కమ్యూనిటీ దిగ్భ్రాంతి

యూకే హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగంలో దూసుకెళ్తున్న నైన్ గ్రూప్ హోటల్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో భారత సంతతికి చెందిన వివేక్ చద్దా (33) కన్నుమూశారు.ఆయన హఠాన్మరణంతో కంపెనీ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 Uk Hotels Firm Mourns Sudden Death Of Indian-origin Ceo Vivek Chadha , Ceo Vivek-TeluguStop.com

వివేక్ మరణంపై కంపెనీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.అయితే ఆయన మృతికి కారణాలు తెలియాల్సి వుంది.

కంపెనీ ప్రకటన ప్రకారం.గత ఆదివారం వివేక్ చద్దా మరణించినట్లుగా తెలుస్తోంది.ఆయన దూరదృష్టి, వ్యాపార వ్యూహాలు, అంకిత భావం కారణంగా తమ వ్యాపారం విస్తరించిందని కంపెనీ కొనియాడింది.ఎన్నో సంవత్సరాలుగా ఆయన కంపెనీతో పాటు ప్రయాణాన్ని సాగించారని.

వివేక్ మరణం తమ సంస్థకు తీరని లోటని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.నైన్ గ్రూప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వివేక్ వద్ద ప్రణాళికలు వున్నాయని తెలిపింది.

కోవిడ్ మహమ్మారికి ఎదురొడ్డి నిలిచి మరి.వ్యాపారాన్ని ఆయన స్ధిరంగా నిలబెట్టాడని కంపెనీ ప్రశంసించింది.

తదుపరి సీఈవో నియామకం జరిగే వరకు ఆయన ప్రణాళికలే అమల్లో వుంటాయని యాజమాన్యం తెలిపింది.అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆయన సంస్మరణార్థం ఒక వేదికను సిద్ధం చేయాలని నైన్ గ్రూప్ .వివేక్ కుటుంబాన్ని కోరింది.

Telugu Ceo Hotels, Stout, Indian Origin, Uk Hotels, Ukhotels, London-Telugu NRI

కాగా.చద్దా ఇటీవలే ప్రముఖ మోడల్ స్టూటీ చద్దాను లండన్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు.బ్రిటన్‌లో అధికారంలో వున్న కన్జర్వేటివ్ పార్టీకి వివేక్ పలు విరాళాలు ఇచ్చారు.

అలాగే 2015లో లండన్‌లోని ప్రఖ్యాత పార్లమెంట్ స్క్వేర్‌లో ఆవిష్కరించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి 1,00,000 పౌండ్లను విరాళంగా అందించారు.గాంధీ సిద్ధాంతాలను వివేక్ అనుసరిస్తారు.ఆయన యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు.సృజనాత్మక మార్గాల్లో జాలి, దయ, ప్రేమను అందించడం, ఆచరించడం అనే గాంధీ మాటలపై తనకు ఆసక్తి వుందని పలు సందర్భాలలో వివేక్ తెలిపారు.

గాంధీ తన శక్తినంతా ఇతరుల సేవలో కేంద్రీకరించాడనే వాస్తవాన్ని యువత తమ దైనందిన జీవితంలో అనుసరించాలని 2015లో గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌కు విరాళం ఇస్తూ వివేక్ పిలుపునిచ్చారు.ఆయన మరణం పట్ల యూకేలోని భారతీయ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube