లీసెస్టర్ అల్లర్లు : ‘‘ఆయనే లేకుంటే’’.. ముస్లింకు కృతజ్ఞతలు తెలిపిన హిందూ వ్యక్తి

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆగస్ట్ 28న ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

 Uk: Hindu Man Thanks Muslim Activist After Leicester Violence , Uk,  Hindu Man,-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.

దీనికి కారణం మీరంటే మీరేనంటూ ముస్లింలు, హిందూవులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో ఒక ముస్లింకు ధన్యవాదాలు తెలిపాడు ఓ హిందువు.

అతనే లేకుంటే తన ప్రాణాలు ఏమయ్యేవోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ గుంపు నుంచి తన ప్రాణాలను కాపాడినందుకు గాను హిందూ వ్యక్తి.

ముస్లింకు కృతజ్ఞతలు తెలిపినట్లు స్కై న్యూస్ నివేదించింది.బాధితుడిని రామ్ కేశ్వాలాగారక్షించిన వ్యక్తిని మాజీద్ ఫ్రీమాన్‌గా గుర్తించారు.

వీడియోలో వున్నదానిని బట్టి రామ్‌ను కొందరు ముస్లిం వర్గీయులు పట్టుకున్నారు.దీనిని గుర్తించిన మాజీద్.

అతనిని విడిచిపెట్టమని వారికి విజ్ఞప్తి చేశాడు.అయినప్పటికీ ఆ గుంపు కారు డోర్ మూసివేసింది.

దీంతో మాజీద్ కారు అద్దాలను పగులగొట్టి.కేశ్వాలాను బయటకు లాగేందుకు యత్నించాడు.

Telugu Arindam Bagchi, Asia Cup, Cricket, Hindu, India, Majid Freeman, Activist,

వీరిద్దరూ కలిసి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.సెప్టెంబర్ 17న జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు.అతను తన ప్రాణాలను కాపాడాడు… అందువల్లే నేను ఇంకా ఇక్కడ వుండగలిగాను అని రామ్ చెప్పాడు.ఫ్రీమాన్ మాట్లాడుతూ.

ప్రస్తుతం లీసెస్టర్‌లో జరుగుతున్నదంతా అల్లకల్లోలమేనని వ్యాఖ్యానించాడు.మరోవైపు ప్రస్తుతం లీసెస్టర్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ… అక్కడి భారతీయుల క్షేమ సమచారంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

అలాగే దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని కోరినట్లు బాగ్చీ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube