కరోనా వైరస్ సోకిన మంత్రిగారు ప్రధానిని కలిశారు,పరిస్థితి ఏంటి  

Uk Health Minister Test Positive For Coronavirus - Telugu British Hospitality Alert, British President Borish Johnson, Corona Virus, Corona Virus Latest Update,

కరోనా పేరు వినగానే జనాలు అప్రమత్తమైపోతున్నారు.ఎందుకంటే ఆ వైరస్ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు.

 Uk Health Minister Test Positive For Coronavirus

ఇప్పటికే ఈ వైరస్ సోకి వేల మంది మృతి చెందుతుండగా, మరోపక్క ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతూ వస్తుంది.అయితే ఈ కరోనా వైరస్ సోకిన బ్రిటీష్ మంత్రి ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ను కలిసినట్లు సమాచారం.

యూకే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నాడీన్ డోరిస్ వారం రోజుల క్రితం యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో పాటు వందలాది మందిని కలిశారని సమాచారం.దీనితో బ్రిటిష్ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

కరోనా వైరస్ సోకిన మంత్రిగారు ప్రధానిని కలిశారు,పరిస్థితి ఏంటి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అసలు మంత్రి డోరీస్ ఎక్కడ కరోనా వైరస్ బారిన పడ్డారు, ఆమె గత వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో అన్న విషయాలు తెలుసుకునేందుకు బ్రిటన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.కరోనా వైరస్‌తో పోరాడటానికి మంత్రి డోరీస్ యూకే లో కొత్త చట్టాన్ని కూడా రూపొందించి, అయితే ఇప్పుడు అదే వైరస్ బారిన ఆమె పడటం అక్కడ తీవ్ర కలవరం రేపుతుంది.

కన్జర్వేటివ్ ఎంపీ, వైద్యశాఖ మంత్రి అయిన డోరీస్ గత వారంరోజుల్లో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో సహా వందలాది మందితో సన్నిహితంగా మెలిగారని బ్రిటన్ వైద్యాధికారులు చెప్పారు.కరోనా వైరస్ చికిత్సకు బీమా కంపెనీల రక్షణ కల్పిస్తూ మంత్రి డోరీస్ జారీ చేసిన ఆదేశాల్లో సంతకం కూడా చేశారు.

అలాంటి ఆమెకు ఈ రోజు అదే వైరస్ సోకడం తో అందరూ ఆమె త్వరలో ఈ కరోనా బారి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అయితే గత వారం రోజుల్లో డోరిస్ కలిసిన వారు ఎవరు వారెవరైనా ఈ వైరస్ బారిన పడ్డారా లేదా అని వైద్య అధికారులు కనుక్కొనే పనిలో పడ్డారు.

మొత్తానికి ఈ కరోనా ప్రపంచదేశాలకు పాకుతుంది.తొలుత చైనా లో మొదలైన ఈ మహమ్మారి క్రమక్రమంగా ఇతర దేశాలకు కూడా పాకుతుండడం తో కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.

మరి ఎంతగా దీనిని నివారించాలని ప్రపంచదేశాలు కట్టడి చేస్తున్నప్పటికీ ఈ వైరస్ మాత్రం ప్రబలుతూనే ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

British President Borish Johnson,corona Virus,corona Virus Latest Update,uk Health Minister Test Positive For Coronavirus- Related....