అంతర్జాతీయ విద్యార్ధుల కోసం యూకే కొత్త విధానం... భారతీయ విద్యార్ధులకు మేలు..!!

అమెరికా, కెనడా, యూకే.చదువు, ఉద్యోగాలపరంగా.

 Uk Opens New Window For Students To Get Funded Int’l Work & Study Placements,-TeluguStop.com

భారతీయ విద్యార్థులకు టాప్-3 గమ్యాలు.ఎంతోకాలంగా మన యువత చూపంతా అమెరికా వైపే! కానీ.

ట్రంప్ కఠిన నిబంధనల కారణంగా యూఎస్ వీసా లభించడం కాస్తంత కష్టమైంది.దీనిని ఇప్పుడిప్పుడే బైడెన్ చక్కదిద్దుతున్నారు.

అయితే కాలం వెంట పరుగులు తీసే నేటి యువత ప్రత్యామ్నాయ దేశాల గురించి అన్వేషణ మొదలైంది.అవే కెనడా, యూకే.

ఇప్పటి వరకు కఠిన వీసా నిబంధనలు అనుసరిస్తూ వచ్చిన యూకే… బ్రెగ్జిట్ నుంచి తప్పుకున్న తర్వాత విదేశీ విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.

పోస్ట్ బ్రెగ్జిట్ గ్లోబల్ ప్రోగ్రామ్ విధానంలో యూకే తీసుకొస్తున్న కొత్త పథకాలు భారతీయ విద్యార్ధులకు మేలు కలిగించనున్నాయి.

దీని ప్రకారం యూకేలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ కోర్సుల కోసం ఎన్‌రోల్ చేసుకున్న భారతీయ విద్యార్ధులు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అధ్యయనం, వర్క్ ప్లేస్‌మెంట్స్‌ను పొందవచ్చు.దీనికి యూకే ప్రభుత్వం నిధులను అందిస్తుంది.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఎనిగ్మా కోడ్‌ను పగులగొట్టి ప్రసిద్ధి చెందిన అలన్ ట్యూరింగ్‌ పేరుతో తీసుకొచ్చిన ‘‘ట్యూరింగ్ స్కీమ్’’ ద్వారా గతంలోని ఎరాస్మస్ ప్లస్ పథకాన్ని భర్తీ చేసేందుకు ఈ శుక్రవారం బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది.

Telugu Indian, Scheme, Uk, Ukwindow-Telugu NRI

దీని ప్రకారం ప్రపంచంలోని ఏ దేశంలోనైనా నాలుగు వారాల నుంచి ఒక ఏడాది వరకు స్టడీ లేదా ట్రైనీషిప్ నియామకాల్లో విద్యార్ధులు చేరవచ్చు.ఇందుకు అయ్యే వ్యయాల కోసం యూకే సర్కార్ గ్రాంట్ ఇస్తుంది.గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ఏడాది వరకు కూడా ఫండెడ్ వర్క్ ప్లేస్‌మెంట్స్‌ను పొందవచ్చు.

ఈ ట్యూరింగ్ స్కీమ్‌లో ప్రస్తుతం 35 వేల నియామకాలు జరుగుతున్నాయి.ఈ పథకం కింద మొదటి విద్యా సంవత్సరానికి యూకే ప్రభుత్వం 110 మిలియన్ డాలర్లు కేటాయించింది.

ఈ పథకం కింద ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు ఏ దేశంలోనైనా ప్రైవేట్ సంస్థ, పబ్లిక్ బాడీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఫౌండేషన్, ఎడ్యుకేషన్ సెంటర్, ఎన్జీవో‌ ఇలా ఎక్కడైనా వర్క్ ప్లేస్‌మెంట్స్ పొందవచ్చు.యువతకు అంతర్జాతీయ అనుభవం, భాషా నైపుణ్యాలు, ఉపాధి మార్గాలు కల్పించడం, ఇతర సంస్కృతులపై అవగాహనను పెంపొందించడం ఈ పథకం లక్ష్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube