లైట్స్, కెమెరా, జస్టిస్: యూకేలో విడాకుల కేసు విచారణ ఇకపై లైవ్ స్ట్రీమింగ్‌లో

విడాకుల విచారణ చరిత్రలో ఇంగ్లాండ్‌లోని వేల్స్‌ కోర్టులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.న్యాయస్థానంలోని నాలుగు గోడల మధ్య జరిగే విచారణను ఇక నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు యూకే న్యాయశాఖ ప్రకటించింది.

 Uk Courts To Livestream Divorce Proceedings-TeluguStop.com

న్యాయవ్యవస్థపై ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్వీట్టర్‌ల ద్వారా కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ విచారణనలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు న్యాయశాఖ వెల్లడించింది.

కేసు విచారణలు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరగదు.ఎలాంటి కేసులను లైవ్ స్ట్రీమింగ్‌కు ఇవ్వాలో అనుమతించే అధికారం న్యాయమూర్తులకు ఉంటుంది.ఒకవేళ దీనిపై జంటలు అభ్యంతరం తెలుపుతూ వారి కేసును లైవ్ స్ట్రీమింగ్‌‌ను నిలుపుదల చేయవచ్చు.జంట, న్యాయమూర్తి, బెంచ్, న్యాయవాదులను వీక్షకులు చూడగలరు.

విడాకులు కోరుతున్న దంపతులు, సంరక్షణ చర్యలలో ఉన్న కుటుంబాలను ఎట్టి పరిస్ధితుల్లో చిత్రీకరణకు అనుమతించరు.కుటుంబ కేసుల యొక్క సున్నితత్వం కారణంగా వారి వివరాలను బయటకు వెల్లడించరు.

ప్రత్యక్ష ప్రసారాలకు ముందు వాద ప్రతివాదులకు ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుంది.ఒకవేళ అభ్యంతరాలు ఉంటే వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చు.

నామినేటేడ్ కేసులను న్యాయవ్యవస్థ వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Telugu Yotube, Live Divorce, Livetelecast, Uklivestream, Ukdivorce-Telugu NRI

ఈ ఏడాది ప్రారంభంలో ఓల్డ్ బెయిలీలో ఉన్నత స్థాయి క్రిమినల్ విచారణను చిత్రీకరించేందుకు ప్రభుత్వం తొలిసారిగా అనుమతించిన సంగతి తెలిసిందే.న్యాయశాఖ కార్యదర్శి, లార్డ్ ఛాన్సలర్ రాబర్ట్ బక్లాండ్ మాట్లాడుతూ… ప్రతిరోజూ ఫ్యామిలీ కోర్టుల్లోని న్యాయమూర్తులు అత్యంత ఉద్వేగభరితమైన కేసులలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.లైవ్ స్ట్రీమింగ్ వంటి కొత్త విధానాల ద్వారా న్యాయవ్యవస్థ మరింత పారదర్శకంగా వ్యవహరించేలా చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం సాధారణ జంటల విడాకుల రేటు తగ్గినప్పటికీ, స్వలింగ జంటల విడాకుల రేటు పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube