బ్యాంక్‌ మోసగాడు నీరవ్ మోదీ ఆలోచనలకు చెక్ పెట్టిన లండన్ కోర్టు.. ఇక జైలే గతినా.. ?

పేరుకు పెద్ద కానీ చేసే పనుల్లో మాత్రం ఆ పెద్దరికం కనపడదు.ఇలాగే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యిన వారిలో కొందరు మన దేశంలోని బ్యాంకులను ముంచి విదేశాల్లో కులుకుతున్నారు.

 Uk Court Shocks Neerav-TeluguStop.com

అలాంటి పెద్ద మనుషుల్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకరు.

కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకే వెళ్లిపోయిన నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది.

 Uk Court Shocks Neerav-బ్యాంక్‌ మోసగాడు నీరవ్ మోదీ ఆలోచనలకు చెక్ పెట్టిన లండన్ కోర్టు.. ఇక జైలే గతినా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చేసిన మోసం నుండి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్ళి, అక్కడే సెటిల్ అయ్యి, భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ మోదీ చేసిన ప్రయత్నాలన్నింటికీ కోర్టు చెక్ పెట్టింది.

ఈ క్రమంలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సామ్యూల్ గూజీ ఈ తీర్పు చెప్పారు.ఇకపోతే పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టిన‌ కేసులో నీర‌వ్ మోదీపై లండ‌న్ కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది.అదీగాక మోసం, మ‌నీ లాండ‌రింగ్ వంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.ఇక ఇండియాకు వచ్చిన వెంటనే నీరవ్ ఊచలు లెక్కపెడుతాడో లేదో చూడాలి.

#UKCourt #Nirav Modi #Neerav Modi #UK Court #Shocks

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు