డబ్బు కోసం అనాథ దత్తత, హత్య: భారత్‌కు నిందితుల అప్పగింతపై యూకే కోర్టు సానుకూలం

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకేకు చెందిన దంపతులను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల మంగళవారం ఇంగ్లాండ్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.మూడేళ్ల క్రితం గుజరాత్‌లోని 11 ఏళ్ల గోపాల్ హత్యకు గురైయ్యారు.

 Uk Court Hears Indias Appeal To Extradite Couple Facing Murder Charges-TeluguStop.com

దీనికి సంబంధించి ఆర్తి ధీర్, ఆమె భర్త కావల్ రైజాడపై పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు.కేసు దర్యాప్తులో భాగంగా వారిని అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని గతేడాది జూలైలో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

దీనిపై భారతదేశం ఇంగ్లాండ్ హైకోర్టులో అప్పీల్ చేయగా ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చింది.వీరిని అప్పగించే చర్యలలో భాగంగా భారత అధికారుల తరపున వాదిస్తున్న యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ మంగళవారం వాదనలు వినిపించింది.

Telugu Telugu Nri, Ukhears-

  వీరి వాదనలు విన్న న్యాయమూర్తులు జేమ్స్ డింగె‌మన్స్, రాబిన్ స్పెన్సర్ తీర్పును రిజర్వ్ చేశారు.మేజిస్ట్రేట్ కోర్టు కోరిన అవసరమైన హామీలను సమర్పించడంలో భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని పలువురు విమర్శించారు.ఈ కేసుకు సంబంధించి భారతదేశంలో దోషులుగా తేలితే దంపతులు పెరోల్ లేకుండా రెండు జీవిత ఖైదులకు గురవుతారనే కారణంతో చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అ ర్బుత్నాట్ వీరిని అప్పగించేందుకు నిరాకరించారు.ఇది యూరోపియన్ మానవ హక్కుల సంఘం ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తుందని తెలిపారు.

2017 జూన్ నాటి ఈ కేసులో ధీర్, రైజాడలను యూకేలో తాత్కాలిక వారెంట్‌పై అరెస్ట్ చేసి, షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేశారు.

కేసు ఇది:

లండన్‌లో నివాసం ఉంటున్న ఆర్తి ధీర్, ఆమె భర్త కావల్ రైజాడ, వీరి బావమరిది గుజరాత్‌లో 12 ఏళ్ల అనాధ బాలుడు గోపాల్ అజానిని దత్తత తీసుకున్నారు.అతని పేరిట 1.30 కోట్లు ఇన్సూరెన్స్ చేయించి, ఆ డబ్బుల కోసం 2017 ఫిబ్రవరి 8న హత్య చేశారు.ఈ కేసులో ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube