మ్యాగీ నూడుల్స్ బ్రహ్మాండం...!

ఒకరికి నచ్చనివి మరొకరికి నచ్చుతాయి.ఒకరికి పనికిరానివి మరొకరికి పనికొస్తాయి.

 Maggi Noodles From India Are Safe-TeluguStop.com

పాపులర్‌ ఆహార పదార్థమైన మ్యాగీ నూడుల్స్ విషయంలో ఇదే జరిగింది.మ్యాగీ నూడుల్స్ మంచివి కావని, అందులో ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు ఉన్నాయని అనేక పరీక్షలు చేసి నిర్థారించుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని నిషేధించింది.

మ్యాగీ వ్యాపార ప్రకటనల్లో కనిపించిన, నటించిన బాలీవుడ్‌ నటీనటులకు నోటీసులు జారీ చేసింది.మ్యాగీ నూడుల్‌్స బ్యాన్‌ చేయడానికి కారణం ఏమిటి? దానిలో సీసం అనుమతించిన దాని కన్నా ఎక్కువ ఉన్నట్లు, మరో రసాయనిక పదార్థం కూడా మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.అయితే బ్రిటన్‌ మాత్రం మ్యాగీ నూడుల్‌్సలో ఎటువంటి లోపం లేదని, ఇది బ్రహ్మాండమని కితాబు ఇచ్చింది.ఇందులో సీసం కూడా మాని చేసే స్థాయిలో లేదని చెప్పింది.

బ్రిటన్లోని ఆహార భద్రత సంస్థ మ్యాగీ పట్ల మంచి అభిప్రాయం వ్యక్తం చేసింది.మ్యాగీ నూడుల్‌్స విక్రయించకూడదని ఇండియా నిషేధం విధించాక దీని సంగతేమిటో చూద్దామని తాము కూడా పరీక్షలు జరిపామని, కాని తమకు ఎలాంటి లోపాలు కనబడలేదని బ్రిటన్‌ సంస్థ తెలిపింది.

ఇండియా నుంచి వచ్చిన మ్యాగీ నూడుల్స్ నమూనాలను ఆస్ర్టేలియా, సింగపూర్‌ దేశాలు కూడా పరీక్షించి ‘గుడ్‌’ అన్నాయి.నూడల్స్ దేశంలో అమ్మకూడదుగాని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతి ఇవ్వడంతో విదేశాలకు ఎగుమతి చేశారు.

అలా ఎగమతి చేసిన నూడుల్‌్సనే విదేశాలు పరీక్షించి మంచి సర్టిఫికెట్‌ ఇచ్చాయి.ఏమిటో ఈ మాయ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube