ఆధార్ కార్డు పేరుతో జరిగే ఈ మోసాలతో జాగ్రత్త

ఆన్ లైన్ సేవలు ఎంత త్వరగా విస్తరిస్తున్నాయో, అన్ లైన్ మోసాలు అంతకన్నా త్వరగా పెరుగుతున్నాయి.మొన్నటికి మొన్న వాట్సాప్ వీడియో కాలింగ్ కి రిజిస్ట్రేషన్ అంటూ లక్షల అకౌంట్లు హ్యాక్ చేసిపడేసారు హ్యాకర్లు.

 Govt Of India Bans Duplicate Aadhar Websites-TeluguStop.com

ఇక ఆధార్ కార్డు మీద ఎప్పుడో నుంచో మోసాలు జరుగుతున్నా, ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచింది భారత ప్రభుత్వం.

చట్టవ్యతిరేకంగా ఆధార్ కార్డు సేవలు అందిస్తున్న వెబ్ సైట్లపై, మొబైల్ యాప్స్ పై కొరడా ఝుళిపించింది మోడి గవర్నమెంటు.

ఆధార్ కార్డు సేవల పేరుతో డబ్బులు దండుకుంటున్న 12 నకిలీ వెబ్ సైట్లపై, ,12 యాప్స్ లపై బ్యాన్ విధించారు.మరో 26 నకిలీ సర్వీసుల అన్ లైన్ మాధ్యమాలను మూయించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

www.uidai.gov.in ఈ అడ్రస్ మాత్రమే ఒరిజినల్, అంటే ప్రభుత్వ వెబ్ సైట్ అన్నమాట.

ఈ వెబ్ సైట్ ద్వారా, అధికార సేవ కేంద్రాలు లేదంటే శాశ్వత నమోదు కేంద్రాలను మాత్రమే ఆధార్ సేవల కోసం ఉపయోగించుకోవాలని uidai సీఈఓ అజయ్ భూషణ్ పాండే ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube