యూజీసీ జాబ్‌ పోర్టల్‌ ప్రారంభం!

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జాబ్‌ పోర్టల్‌ ప్రారంభించింది.ఇందులో నిరుద్యోగులు ఉద్యోగాలు సులువుగా పొందే అవకాశం ఉంటుంది.

 Ugc Job Portal Net Set Phd Candidates Jobs-TeluguStop.com

కానీ, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.

దీనికి ప్రధానంగా యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష పాసై ఉండాలి.లేదా ‘సెట్‌’కి అర్హత సాధించినవారు, ఏదైనా విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు ఈ పోర్టల్‌లో జాబ్‌ సంపాదించేందుకు అర్హులు.
పీహెచ్‌డీ, నెట్, సెట్‌ అర్హత సాధించినవారికి కాలేజీ లేదా యూనివర్శిటీల్లో చాలా ఉద్యోగాలు ఉంటాయి.కానీ, అవి వేర్వేరుగా నోటిఫికే షన్‌ ఇస్తుంటాయి.అన్నింటికీ కలిపి ఒకేచోట సమాచారం లభించడం లేదు.అందుకే ఈ సమస్యకు పరిష్కారం దిశగా యూజీసీ జాబ్‌ పోర్టల్‌ ప్రారంభించింది.

 Ugc Job Portal Net Set Phd Candidates Jobs-యూజీసీ జాబ్‌ పోర్టల్‌ ప్రారంభం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా కారణంగా కూడా ఇప్పటి వరకు దాదాపు అన్ని జాబ్‌ నోటిఫికేషన్లకు బ్రేకులు పడ్డాయి.అయినా, ఇప్పుడిప్పుడే కొన్ని చిన్నాచితకా ప్రతిరోజూ ఏదో ఒక జాబ్‌ నోటిఫికేషన్‌ వస్తూనే ఉన్నాయి.

అర్హులైనవారు https://www.ugc.ac.in/jobportal/ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.అందులోనే ప్రోఫైల్‌ కూడా క్రియేట్‌ చేసుకోవాలి.ఇప్పటికే ఇందులో 54,767 నెట్, 14,133 నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులు, 15,296 సెట్‌ అభ్యర్థులు, 26808 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.
ఇందులో కేవలం టీచింగ్‌ జాబ్‌లే కాకుండా, నాన్‌ టీచింగ్‌ పోస్టులు కూడా పొందుపరిచేందుకు యూజీసీ ప్రయత్నిస్తోంది.త్వరలో పోర్టల్‌ మరింత అప్‌గ్రేడ్‌ చేసి, అందరి ముందుకు రానుంది.

దీంతో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులకు ఒకే వేధికపై అందుబాటులోకి రానుంది.

#UGC Job Portal #UGCLaunched #TeachingAnd #SETAnd #NETQualified

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు