ఉగాది కానుకగా RRR పోస్టర్.. సంబరాలు చేసుకుంటున్న భీమ్, రామ్..!

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ ( రౌద్రం రణం రుధిరం ).ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 ఉగాది కానుకగా Rrr పోస్టర్.. సంబరాలు చేసుకుంటున్న భీమ్, రామ్..!-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.అయితే ఈ రోజు ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో కొమరం భీం ను, రామరాజు ను జనాలు ఎత్తుకుని పైకి ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్న ఆసక్తికర పోస్టర్ ను రాజమౌళి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ వదిలాడు.ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ పంచ కట్టుతో, రామ్ చరణ్ ఫాంటు షర్ట్ తో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

 ఉగాది కానుకగా RRR పోస్టర్.. సంబరాలు చేసుకుంటున్న భీమ్, రామ్..!-ఉగాది కానుకగా RRR పోస్టర్.. సంబరాలు చేసుకుంటున్న భీమ్, రామ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇంకా రాజమౌళి వదులుతున్న పోస్టర్స్, టీజర్స్ తో ఇంకా అంచనాలు పెంచుతున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంటే, రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా విడుదల అవ్వడానికి చాలా సమయం ఉన్న అప్పుడే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయి.ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

https://twitter.com/DVVMovies/status/1381827093894328322/photo/1
#UgadiSpecial #Rajamouli #Ram Charan #Ugadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు