సుధీర్‌, రష్మీ లేని ప్రేమను బతికించుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే?       2018-06-26   21:59:25  IST  Raghu V

బుల్లి తెరపై ఈ మద్య కాలంలో రష్మి, సుధీర్‌ల ప్రేమ వ్యవహారం ప్రేక్షకులను ఎంతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కూడా బుల్లి తెరపై నిజంగానే ప్రేమికులా అన్నట్లుగా నటిస్తూ పలు షోలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి కూడా విపరీతమైన ఆధరణ దక్కుతుంది. వీరి మద్య ప్రేమ ఉందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే వారిద్దరు మాత్రం పలు సార్లు తమ మద్య ఎలాంటి ప్రేమ లేదని, అదంతా కూడా షో కోసం చేస్తుంటాం అంటూ ఉన్నారు. రష్మి తాజాగా మరోసారి తమ మద్య ఎలాంటి ప్రేమ లేదని తేల్చి చెప్పింది.

సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌తో కొద్ది సమయం చిట్‌ చాట్‌ చేసిన రష్మి, సుధీర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చింది. సుధీర్‌ నిజంగా లవ్‌ ప్రపోజ్‌ చేసినప్పుడు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు అంటూ ఒక అభిమాని ప్రశ్నించిన సమయంలో నాఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది. ప్రోగ్రాం కోసం చేసిన స్కిట్‌ అది అని, దానికి నేను రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదని రష్మి చెప్పుకొచ్చింది. సుధీర్‌తో చాలా క్లోజ్‌గా ఆన్‌ స్క్రీన్‌లో ఉండే రష్మీ, ఆఫ్‌ స్క్రీన్‌లో మాత్రం సుధీర్‌కు అస్సలే టచ్‌లో ఉండదని, సుధీర్‌తో కనీసం స్నేహంగా కూడా ఉండదు అంటూ కొందరు చెబుతున్నారు.

సుధీర్‌, రష్మీల కోసం ఎంతో మంది జబర్దస్త్‌ మరియు ఢీలను చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ కారణంగానే వీరిద్దరికి భారీగా డిమాండ్‌ ఉంది. సుధీర్‌, రష్మీలు కలిసి చేస్తామంటే నిర్వాహకులు భారీ పారితోషికంను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే వీరిద్దరు కూడా తమ మద్య లేని ప్రేమను ఉన్నట్లుగా ప్రేక్షకులకు చూపిస్తూ నటిస్తూ ఉన్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ మద్య ఎలాంటి ప్రేమ లేదని, సుధీర్‌ తనకు స్నేహితుడు అంటూ రష్మీ చెబుతున్నప్పటికి, సుధీర్‌ మాత్రం నోరు తెరవడం లేదు.

ఇప్పటి వరకు తాను రష్మీని ప్రేమించడం లేదు అని సుధీర్‌ నోటి నుండి రాలేదు. ఎప్పుడు చూసినా కూడా రష్మీ పేరు చెప్పగానే మురిసి పోవడం, సిగ్గు పడటం చేస్తూ ఉంటాడు. అంటే సుధీర్‌ కూడా రష్మీతో లాభపడేందుకు ప్రేమ లేదనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. రష్మీతోనే కాకుండా సుధీర్‌ తనతో వర్క్‌ చేసే ప్రతి ఒక్కరితో అలాగే ఉంటాడని, కాకుంటే రష్మీతో ఎక్కువ కాలం అవ్వడం వల్ల వారిద్దరి మద్య ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. వీరిద్దరి మద్య ప్రేమ ఉందని ప్రేక్షకులు అనుకున్నంత కాలం వీరిద్దరి జోడీకి ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. అందుకే వీరిద్దరు కూడా ప్రేమ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా లేని ప్రేమను బతికించుకుంటూ వస్తున్నారు.