షూటింగ్ లో పాల్గొన్న స్టార్ ఎమ్మెల్యే.. ఎవరంటే?

ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం చేత పలు సినిమా షూటింగులన్ని ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలోనే తెలుగు తమిళ హిందీ భాషల్లో చిత్రాలన్ని సెట్స్ పైకి వెళ్ళాయి.

 Mla Udayanidhi Stalin Joins Upcoming Movie Shooting In Puducherry, Udhayanidhi S-TeluguStop.com

తాజాగా తమిళ స్టార్ హీరో, ప్రస్తుత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ రాజా చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు.ఇన్ని రోజులు వరకు షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను తిరిగి ప్రారంభించింది.

ఈ క్రమంలోనే ఈ చిత్రం తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ లో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు.ఈ సినిమాలో ఉదయనిది సరసన నిధి అగర్వాల్ నటించనున్నారు.

కలైయరసన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ రియాల్టీ ప్రేమ్‌ ఆరవ్‌ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Corona, Kollywood, Mlaudayanidhi, Nidhi Agarwal-Movie

ఈ ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల గణితం తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉదయనిది చెపాక్ -తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు.ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ముందుగా సంతకం చేసిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత పూర్తిగా సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు సమాచారం వినబడుతుంది మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఈ క్రమంలోనే ఉదయనిది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube