ద్రౌపదీ ముర్మూకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు ఇస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.శివసేనలోని మెజార్టీ ఎంపీలు ద్రౌపదీ ముర్మూకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలిచ్చారు.

 Uddhav Thackeray And Majority Shivasena Mps Supporting Nda President Candidate D-TeluguStop.com

దీనిపై శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.మద్దతు విషయంలో ఏది సరైందని అనిపిస్తే అదే శివసేన చేస్తుందన్నారు.

గతంలో కూడా యూపీఏ అభ్యర్థులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీకి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని రౌత్ గుర్తు చేశారు… రాజకీయాలకు అతీతంగా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే శివసేన నిర్ణయముంటుందన్నారు.ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయిస్తే దాని అర్ధం బీజేపీకి మద్దతిచ్చినట్లు కాదని ఆయన పరోక్ష సంకేతాలిచ్చారు.

అయితే, దీనిపై ఉద్ధవ్ ఠాక్రే ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని రౌత్ తెలిపారు…

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై శివసేన సోమవారం కీలక సమావేశం నిర్వహించింది.శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఆ భేటీకి ఇద్దరు మినహా ఎంపీలందరూ హాజరయ్యారు.

శివసేనకు మొత్తం 21మంది ఎంపీలున్నారు.వారిలో 18మంది లోక్ సభ సభ్యులు కాగా, ముగ్గరు రాజ్యసభ సభ్యలు.

మొత్తమ్మీద శివసేనకు చెందిన 16మంది ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కృతికర్‌ వెల్లడించారు.ద్రౌపది ఆదివాసీ వర్గానికి చెందినన వారు కావడం.

పైగా ఓ మహిళ కావడంతో ఆమెకే మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్లు గజానన్‌ తెలిపారు.

Telugu Draupadi Murmu, Eknath Shinde, Nda Candi, Sanjay Raut, Shivasena Mps, Sri

ముంబయిలోని ఠాక్రే నివాసమైన మాతోశ్రీలో జరిగిన ఆ సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువమంది ఎంపీలు ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.ఆ భేటీకి ఇద్దరు ఎంపీలు… భావనా గవాలి, శ్రీకాంత్‌ శిండే హాజరుకాలేదు.అయితే, వారిద్దరు కూడా ముర్మూకే ఓటు వేయనున్నట్లు చెబుతున్నారు.

వారిలో శ్రీకాంత్‌ శిండే స్వయానా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే తనయుడు కావడం గమనార్హం.రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలకు విప్‌ జారీ చేసే అధికారముండదు.

దాంతో ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు ఇష్టం ఉన్న అభ్యర్థులకు ఓటు వేసే అవకాశముంటుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube