అయోద్య రామాలయంకు ఆ సీఎం కోటి విరాళం

గత ఏడాది అయోధ్య రామాలయం కేసులో తుది తీర్పు వచ్చిన విషయం తెల్సిందే.అయోద్యలో రామ మందిరంకు అనుమతి ఇస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

 Uddavu Thakre Give The 1 Crore Fund To Ayyodya Ramalayam-TeluguStop.com

దాంతో రామ మందిర నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.రామ మందిరం నిర్మాణంకు విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.

ఇప్పటికే కోట్లలో విరాళాలు వచ్చాయి.ఇక రాజకీయ ప్రముఖులు పలువురు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు.

తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే రామ మందిరం కోసం కోటి రూపాయల విరాళంను ప్రకటించాడు.సీఎం అయిన తర్వాత మొదటి సారి అయోధ్యకు వెళ్లిన ఉద్దవ్‌ థాక్రే అక్కడ మీడియాతో మాట్లాడాడు.

తమ పార్టీ ఎప్పటికి కూడా హిందుత్వ పార్టీనే అన్నాడు.బీజేపీతో విభేదాలు ఉన్నంత మాత్రాన తమది హిందుత్వ పార్టీ కాకుండా పోదు అన్నాడు.

రామ మందిర నిర్మాణం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube