భీమా-కోరెగావ్ హింసాత్మక ఘటనలపై సంచలన నిర్ణయం తీసుకున్న ఉద్దవ్

భీమా-కోరె గావ్ హింస ఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల మహారాష్ట్ర లో మహావికాస్ అఘాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఎన్సీపీ ఎమ్మెల్యేల తో సమావేశం జరిపిన ఉద్దవ్ పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.2018 జనవరి 1వతేదీన భీమా కోరెగావ్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద జరిగిన హింసపై నమోదైన అల్లర్ల కేసులో పలువురు యువకులు, మహిళలు, దళిత కార్యకర్తలు చిక్కుకున్నారు.దేశద్రోహ ఆరోపణలతో అరెస్టు అయిన కార్యకర్తలపై, చట్టవిరుద్ధమైన మావోయిస్ట్ సంస్థలతో సంబంధాలున్న కేసులను ఉపసంహరించుకోలేరు.సీఎంతో భేటీలో ఎన్సీపీ సీనియర్ మంత్రులు జయంత్ పాటిల్, చుగన్ భుజ్‌బల్ గజ్భీయెలున్నారని ఎన్సీపీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

 Uddav Take Sensational Decision About Bhima Koregav-TeluguStop.com

అయితే ఆ సమయంలో నమోదైన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని మేం నిర్ణయించాం.

Telugu Maharastra, Uddav-Telugu Political News

వాస్తవానికి, గత ప్రభుత్వం కూడా భీమా కోరెగావ్ హింసలో కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు దానిని ఆచరణలో మాత్రం పెట్టలేదు.కానీ మేము మాత్రం ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటాం అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube