ఇండస్ట్రీలోనే ఎక్కువ పారితోషికం తీసుకునే ఉదయభాను కెరీర్ ఎందుకు ఇలా అయ్యింది?

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు తమ దైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెరపై సీనియర్ యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్లలో ఉదయభాను ఒకరు.

 Udayabhanus Take Highest Paid In The Industry But She Losed His Career-TeluguStop.com

ఒకప్పుడు ఈమె బుల్లితెర స్టార్ మహిళగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుని అప్పట్లోనే అందరికన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ఉదయ భాను వ్యక్తిగత విషయానికి వస్తే కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలను అనుభవించింది.

 Udayabhanus Take Highest Paid In The Industry But She Losed His Career-ఇండస్ట్రీలోనే ఎక్కువ పారితోషికం తీసుకునే ఉదయభాను కెరీర్ ఎందుకు ఇలా అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని క్రమక్రమంగా ఎదుగుతూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.ఉదయ భాను 15 సంవత్సరాల వయసులోనే హృదయాంజలి అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఆ తర్వాత వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను వంటి ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు.

ఇలా బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీని దక్కించుకున్న తర్వాత వెండితెరపై కూడా తళుక్కుమన్నారు.

ఈ క్రమంలోనే శ్రావణమాసం, ఎర్రసైన్యం, లీడర్, కొండవీటి సింహం వంటి సినిమాల్లో కూడా నటించారు.

Telugu Anchor, Anchor Udaya Bhanu, Career, Tollywood, Udaya Bhanu Family, Udaya Bhanu Movie Career, Udaya Bhanu Re Entry, Udayabhanu-Movie

ఇలా ఇండస్ట్రీలో వెండితెరపై బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్న ఉదయభాను ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ప్రస్తుతం ఈమెకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.అసలు ఆమె కెరీర్ ఇలా అవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

గతంలో ఉదయభానుకు ఎవరితోనో ఎఫైర్ ఉన్నాయంటూ పెద్దఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఎంతో మానసికంగా ఉదయభాను కృంగిపోయిందని సమాచారం.ఈ సమయంలోనే తన పెళ్లి తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత తను పండంటి కవల ఆడబిడ్డలకు జన్మనివ్వడంతో తన ప్రపంచం పూర్తిగా తన పిల్లలలోనే దాగి ఉందని, అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరమైన కేవలం ఒక తల్లిగా తన పిల్లల బాధ్యతలను వారి సంరక్షణ చూసుకుంటుంది.

Telugu Anchor, Anchor Udaya Bhanu, Career, Tollywood, Udaya Bhanu Family, Udaya Bhanu Movie Career, Udaya Bhanu Re Entry, Udayabhanu-Movie

ఈ లోకంలో తన పిల్లల కన్నా ఏదీ ఎక్కువ కాదు అంటూ తన పూర్తి సమయాన్ని తన పిల్లలకే కేటాయించాలని ఉదయభాను భావించింది.అందుకే ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన పిల్లలకు సంబంధించిన పలు వీడియోలను, వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తన పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఉదయభానుకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

#Udaya Bhanu #Career #Udayabhanu #Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు