ఉదయ్ కిరణ్ ఆ కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు…  

Uday Kumar Tollywood Hero Vishitha Sridevi Suicide Death News Financial News - Telugu Financial News, Sridevi, Suicide Death News, Tollywood Hero, Uday Kumar, Vishitha

టాలీవుడ్ లో నువ్వు నేను, మనసంతా నువ్వే, గుండె ఝల్లుమంది, నీ స్నేహం, వంటి హిట్ హీరోగా చిత్రాల్లో నటించిన టువంటి స్వర్గీయ హీరో ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాడు.అయితే ఒకప్పుడు తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనటువంటి ఉదయ్ కిరణ్ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వరుస పరాజయాలను చవి చూశాడు.

 Uday Kumar Tollywood Hero Vishitha Sridevi Suicide Death News Financial News

దీంతో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కారణంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన మృతిపై స్పందించలేదు.

ఉదయ్ కిరణ్ ఆ కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.ఇందులో భాగంగా ఉదయ్ కిరణ్ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఆత్మహత్య చేసుకోలేదని అంతేగాక ఉదయ్ కిరణ్ మృతిపై తన భార్య విషిత గురించి పలు అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఉదయ్ కిరణ్ కి పెళ్లి అయ్యే సమయంలో తన తల్లి కోట్ల రూపాయల విలువ చేసే ఇచ్చిందని శ్రీదేవి తెలిపింది.దీన్ని బట్టి చూస్తే ఉదయ్ కిరణ్  ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు కూడా లేవని తెలిపింది.

అంతేగాక ఉదయ్ కిరణ్ మృతి చెందిన తర్వాత అతడి భార్య విషిత తమ కుటుంబాన్ని దూరం పెట్టిందని వాపోయింది.అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని అందరూ ఆత్మహత్య అనుకుంటున్నారని తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు