ఉదయ్ కిరణ్ తన భార్య గురించి పెళ్లి ముందు రోజు రాత్రి నాతో....

తెలుగులో ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు “ఉదయ్ కిరణ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఉదయ్ కిరణ్ వృత్తి పరమైన సమస్యలు కారణంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 Uday Kiran Sister Sridevi Kiran Sensational Comments On Vishitha, Uday Kiran, Ud-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.అయితే ఆ మధ్య ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి కిరణ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా ఉదయ్ కిరణ్ తన భార్య విషిత ని ఎంతగానో ప్రేమించాడని తెలిపింది.అంతేకాకుండా విషితతో పెళ్లి జరిగే ముందు రోజు రాత్రి తనతో ఉదయ్ కిరణ్ ఆమె మంచితనం మరియు కేరింగ్ వంటి విషయాల గురించి రాత్రంతా తనతో మాట్లాడుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది.

అంతేగాక తన కుటుంబంలో తన తర్వాత తనని అంత బాగా అర్థం చేసుకున్నది విషిత మాత్రమేనని అంతేగాక తమ ఇద్దరి అభిరుచులు కూడా కలవడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఉదయ్ కిరణ్ తన సోదరి శ్రీదేవి తో చెప్పాడట.

Telugu Sensational, Sridevi Kiran, Uday Kiran, Udaykiran, Vishitha-Movie

అలాగే శ్రీ దేవి కిరణ్ మరియు ఉదయ్ కిరణ్ కి వయస్సు భేదం దాదాపుగా పది సంవత్సరాలకి పైగా ఉండటంతో శ్రీ దేవి ఉదయ్ కిరణ్ ని తమ్ముడులా కాకుండా కొడుకులాగా చూసుకునేదానినని ఎమోషనల్ అయ్యింది.అంతేగాక ప్రతి విషయంలోనూ ఉదయ్ కిరణ్ తన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకునేవాడని కూడా చెప్పుకొచ్చింది.అయితే ఉదయ్ కిరణ్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అడ్వాన్సులు ఇచ్చిన కొంతమంది సినీ నిర్మాతలు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరడంతో ఉదయ్ కిరణ్ ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసాడని ఎవరికి కూడా డబ్బు ఎగ్గొట్టలేదని తెలిపింది.

ఏదేమైనప్పటికీ ఎంతో మంచి సినిమా భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్ హీరో ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube