టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఒకరు.ఈయన ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న ఉదయ్ కిరణ్ కు క్రమక్రమంగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ మానసిక క్షోభకు గురి అయ్యారు.ఇలాంటి ఇబ్బందుల కారణంగా ఈయన తన ఫ్లాట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇలా ఈయన మరణ వార్త అభిమానులు ఎంతగానో కృంగదీసింది.అయితే ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.ఇకపోతే తాజాగా ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను( Nuvvu Nenu ) తిరిగి విడుదల కావడానికి సిద్ధమవుతోంది.డైరెక్టర్ తేజ ( Teja ) దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.

ఇలా ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ( Sridevi ) స్పందించారు.నువ్వు నేను సినిమా చాలా స్పెషల్.ఈ సినిమా మార్చి 21న రీరిలీజ్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది.ఎందుకంటే.
ఈ సినిమాతోనే ఉదయ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.ఇది తనకి గొప్ప అవకాశం.
మళ్లీ ఈసినిమా తెరపైకి వచ్చే సమయం రావటం చాలా సంతోషంగా ఉంది.సినిమా తెరపై ప్రదర్శించి టాలీ వుడ్ ప్రముఖులకు మరోసారి నివాళి అర్పించే అవకాశం వచ్చిందన్నారు.
ఇలాంటి సినిమాను అందించిన ఆ మూవీ యూనిట్ కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.