వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. నగలను అక్కకు ఇవ్వాలంటూ?

Uday Kiran Last Letter Goes Viral In Social Media

చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై తక్కువ సమయంలోనే విజయాలతో పాటు పేరు ప్రఖ్యాతులను ఉదయ్ కిరణ్ సొంతం చేసుకున్నారు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన ఈ హీరో తన టాలెంట్ తో ఎంతోమంది అభిమానులకు చేరువయ్యారు.

 Uday Kiran Last Letter Goes Viral In Social Media-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలోనే ఉదయ్ కిరణ్ సంచలన విజయాలను ఖాతాలో వేసుకున్నారు.అయితే చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ లేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో కెరీర్ ను కొనసాగించారు.అయితే వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో ఉదయ్ కిరణ్ ఫెయిల్ అయ్యారు.

 Uday Kiran Last Letter Goes Viral In Social Media-వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. నగలను అక్కకు ఇవ్వాలంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరైన సక్సెస్ లేకపోవడం ఉదయ్ మానసిక ఆవేదన చెందాడనే కామెంట్లు వినిపించాయి.సినిమాలలో ఆఫర్లు తగ్గిన తర్వాత ఉదయ్ విషిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ రాసిన చివరి లెటర్ లో అమ్మ తర్వాత తాను అదే స్థాయిలో ప్రేమించిన అమ్మాయి విషిత అని గొడవల వల్ల ఆంటీ, అంకుల్ బాధ పడుతున్నారని చెప్పుకొచ్చారు.

Telugu Family Issuets, Financial Problems, Interesting Facts, Jwelleries, Letter Viral, Mother, Shocking Comments, Sister, Tollywood, Uday Kiran, Uday Kiran Last Letter, Uday Kiran Suicide, Vishitha-Movie

నువ్వు అతడు మంచివాడని నమ్ముతున్నావని అయితే అతను మంచివాడు కాదని భార్యకు సూచనలను ఉదయ్ లేఖలో పేర్కొన్నారు.తన భార్యకు నిజం తెలిసే సమయానికి తాను భూమిపై ఉండనని ఉదయ్ అన్నారు.తనకు ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయని ఉదయ్ పేర్కొన్నారు.

Telugu Family Issuets, Financial Problems, Interesting Facts, Jwelleries, Letter Viral, Mother, Shocking Comments, Sister, Tollywood, Uday Kiran, Uday Kiran Last Letter, Uday Kiran Suicide, Vishitha-Movie

అందరూ సంతోషంగా ఉండాలంటే తాను భూమిపై ఉండకూడదని భావిస్తున్నానని ఉదయ్ అన్నారు.అమ్మ అంటే తనకు చాలా ఇష్టమని ఉదయ్ కిరణ్ చెప్పుకొచ్చారు.అమ్మ ఇచ్చిన నగలను అక్కకు తిరిగి ఇవ్వాలని అమ్మను కౌగిలించుకుని ఏడవాలని ఉందని అందుకే అమ్మ దగ్గరకు వస్తున్నానని ఉదయ్ పేర్కొన్నారు.గొడవలు, ఆర్థిక సమస్యల వల్లే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ లేఖతో స్పష్టమవుతోంది.

#Vishitha #Sister #Family Issuets #Letter #Uday Kiran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube