సెన్సేషనల్ డైరెక్టర్ తేజ(Teja) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అహింస( Ahimsa) .దగ్గుబాటి అభిరామ్ ( Abhiram ) లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

నటుడు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే.ఉదయ్ కిరణ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసినది దర్శకుడు తేజ అనే విషయం మనకు తెలిసిందే. చిత్రం సినిమా( Chitram Movie ) ద్వారా హీరోగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అనంతరం తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారాయి.ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా మరణించారు.
ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటూ యాంకర్ ప్రశ్నించగా తేజ పాపం అంటూ సమాధానం చెప్పారు.

అలాగే ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి మీ మాటల్లో అంటూ యాంకర్ ప్రశ్నించడంతో అందుకు స్పందించిన తేజ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తెలిసి కూడా చాలామంది తెలియనట్టు నటిస్తున్నారని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే గతంలో తేజ ఉదయ్ కిరణ్ మరణం గురించి మాట్లాడుతూ తన చావుకి గల కారణాలు నాకు తెలుసని అయితే ఈ విషయాన్ని తాను చనిపోయేలోపు కచ్చితంగా బయటపెట్టి చనిపోతాను అంటూ ఉదయ్ కిరణ్ చెప్పిన విషయం మనకు తెలిసిందే.ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యాంకర్ ప్రశ్నించడంతో తేజ అందరూ నటిస్తున్నారంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.
