అనుకోకుండా చిత్రం( Chitram ) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ మొదటి మూడు సినిమాలు అయినా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హీరోగా పేరు సంపాదించాడు.అలాంటి ఉదయ్ కిరణ్ తెలంగాణకు చెందినవాడు.
ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరో రేంజ్ తెచ్చుకోవడం తో చిరంజీవి( Chiranjeevi ) కూడా తన ఇంటి అల్లుడి గా చేసుకోవాలని ఎంతగానో ఆరాటపడ్డారు.ఇక ఉదయ్ కిరణ్ మీద ఉన్న ఇష్టంతో తన పెద్ద కూతురు సుస్మిత ( Susmitha ) తో 2003లో ఎంగేజ్మెంట్ జరిపించినప్పటికీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు.
ఇక 2012లో విషిత అనే అమ్మాయిని ఉదయ్ కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషిత( Vishitha ) తో కనీసం రెండు సంవత్సరాలు కూడా కలిసి జీవించకుండానే తన సొంత ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఇక ఉదయ్ కిరణ్ మరణం పట్ల రకరకాల ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే ఉదయ్ కిరణ్ ( Uday kiran ) సినిమాల్లోకి వచ్చాక వరుసగా మూడు హిట్స్ అందుకొని ఆ తర్వాత కథల ఎంపికలో తడబడడంతో తనకి సెట్ అయ్యే కథను ఎంచుకోక వరుసగా సినిమాలు ప్లాఫ్ అయ్యాయి.
దాంతో కొంతమంది దర్శక నిర్మాతలు తనకు ఇచ్చిన అడ్వాన్స్ ని కూడా వెనక్కి తీసుకున్నారు.అలా డిప్రెషన్ లోకి వెళ్లి ఏం చేయాలో అర్థం కాక సినిమాల మీద ఉన్న పిచ్చితో ఎప్పుడూ సినిమాలోకం లోనే బతికేవారని ఆయనతో నటించిన చాలామంది నటీనటులు చెప్పారు.
అయితే ఈయన చనిపోయాక ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అయినప్పటికీ తాజాగా మరో వార్త కూడా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
అదేంటంటే.ఉదయ్ కిరణ్ ( Uday kiran ) చనిపోయే ముందు ఆయనకు ఒక భయంకరమైన కల వచ్చిందట.ఇక ఆ కలలో ఉదయ్ కిరణ్ తనకు తానే స్వయంగా తన భార్య ఇంట్లో లేని టైం చూసి ఉరి వేసుకుని మరణించినట్టు కల వచ్చిందట.
ఇక ఆ కల రావడంతోనే ఉదయ్ కిరణ్ కి రాత్రంతా నిద్ర పట్టలేదట.తెల్లవారుజామున ఈ విషయం తన భార్యకు చెబితే మీరు డిప్రెషన్ లోకి వెళ్లి ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలియడం లేదు.
కాసేపు అవన్నీ పక్కనపెట్టి మైండ్ ని ఫ్రెష్ గా ఉంచుకోండి అని చెప్పి బయటకు వెళ్లిందట.ఇక ఆ కల వచ్చిన వారం రోజుల్లోనే ఉదయ్ కిరణ్ భార్య ఇంట్లో లేని సమయం చూసి సూసైడ్ చేసుకొని మరణించారు.
ఇక ఆయనకు ఏదైతే కల వచ్చిందో అదే నిజమైందట.