ఉదయ్ 12 సినిమాల్లో 8 చిత్రాలకు ఆర్పీ సంగీతం అందించగా..వీరి బంధం ఎలా ఉండేది ?

ఉదయ్ కిరణ్. చాల మందికి ఒక ఎమోషన్ తో కూడుకున్న వ్యక్తి.నటుడిగా ఎదిగాడు, మనిషి పోయిన అందరి మనుసుల్లో నిలిచాడు.2000 సంవత్సరంలో చిత్రం సినిమాతో తేజ ఉదయ్ కిరణ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.అది విజయవంతం అయ్యాక ఆ తర్వాత కూడా నువ్వు నేను వంటి మరో సినిమాతో తేజ మరియు ఉదయ్ కిరణ్ కాంబినేషన్ మరోమారు వర్క్ అవుట్ అయ్యి ఇద్దరికి హిట్ దొరికింది.ఆ తర్వాత వి ఎన్ ఆదిత్య దర్శకత్వం లో మనసంతా నువ్వే చిత్రం రాగ అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

 Uday Kiran Bonding With R P Patnayak Details, Rp Patnaik, Uday Kiran, Uday Kiran-TeluguStop.com

దాంతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హీరో గా రికార్డు సృష్టించాడు.

ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకున్న నటుడు ఉదయ్ కిరణ్ కాగా, ఈ మూడు చిత్రాలకు సంగీతం అందించి ఆర్ పి పట్నాయక్ సైతం అద్భుతమైన సంగీతం తో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక నాల్గవ సినిమా కలుసుకోవాలని చిత్రానికి మాత్రం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఈ సినిమా యావేరేజ్ గా నిలిచింది.ఈ చిత్రం తర్వాత మరో మూడు సినిమాలకు సైతం ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.

అవి నీ స్నేహం, హోలీ, శ్రీరామ్ చిత్రాలు.ఇందులో నీ స్నేహం ఘనవిజయం సాధించగా మిగతా రెండు సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి.

Telugu Nuvvu Nenu, Patnayak, Tollywood, Uday Kiran, Udaykiran-Movie

ఇలా మరో మారు ఉదయ్ కిరణ్ తో ఆర్పీ పట్నాయక్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన ఒకటి రెండు సినిమాలు వచ్చిన మళ్లి నీకు నేను నాకు నువ్వు సినిమాతో గాడిన పడ్డారు.ఇక చివరగా ఔనన్నా కాదన్నా సినిమాకు సైతం ఆర్పీ సంగీతం సమకూర్చారు.ఇలా కెరీర్ మొత్తం మీదుగా ఉదయ్ కిరణ్ 20 సినిమాలో నటించాడు.

Telugu Nuvvu Nenu, Patnayak, Tollywood, Uday Kiran, Udaykiran-Movie

దాంట్లో ఒకటి రెండు సినిమాలు విడుదల కాకపోగా ఒక మూడు తమిళ సినిమాలు ఉన్నాయ్.ఇక అందులో 12 సినిమాలు తెలుగు లో విడుదల అవ్వగా 8 సినిమాలకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.ఇలా ఉదయ్ కిరణ్ తో ఆర్పీ బంధం కొనసాగింది.ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత ఆర్పీ శవాన్ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్లగా ఒక మూలగా పక్కకు పెట్టేసిన ఉదయ్ కిరణ్ ని చూసి ఎలా బ్రతికాం అనే దాని కన్నా ఎలా చనిపోయం అనేది కూడా ముఖ్యం అని తెలుసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube