వాట్సాప్‌‌ ద్వారా ఉబర్ రైడ్ బుకింగ్.. ఎలాగో మీకు తెలుసా..!?

Uber Ride Booking Via Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది.కేవలం మెసేజింగ్ యాప్ లా మాత్రమే కాకుండా ఇప్పుడు వాట్సాప్ లోనే రైడ్ లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

 Uber Ride Booking Via Whatsapp-TeluguStop.com

ప్రముఖ రైడింగ్ యాప్ అయిన ఉబర్ (Uber) తో కలిసి వాట్సాప్‌ లో ఇకమీదట ట్యాక్సీ, ఆటో, బైక్ లను బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతదేశంలో ప్రారంభించింది ఉబర్.ప్రపంచంలో తొలిసారిగా వాట్సాప్‌ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ పై ఈ ఫీచర్ తీసుకొచ్చింది ఉబర్.

అయితే వాట్సాప్‌లో ఇలా రైడ్‌ బుక్ చేసుకునే సదుపాయాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో ప్రవేశపెట్టింది ఉబర్.మరికొద్ది రోజుల్లో దేశం అంతా విస్తరించనుంది.అతి త్వరలోనే దేశంలోని మిగిలిన నగరాల్లో ప్రారంభించనుంది.

 Uber Ride Booking Via Whatsapp-వాట్సాప్‌‌ ద్వారా ఉబర్ రైడ్ బుకింగ్.. ఎలాగో మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.ఈ కొత్త సదుపాయం వల్ల యూజర్లు తమ మొబైల్ లో ఉబర్ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే డైరెక్ట్ వాట్సాప్‌ ద్వారా రైడ్‌ బుక్ చేసుకోవచ్చు.అయితే ఇలా బుక్ చేసుకోవాలంటే ముందుగా మీ ఫోన్‌ నంబర్‌తో ఉబర్‌లో రిజిస్టర్ అయ్యి  ఉండాలి.

ఆ తరువాతనే మీరు వాట్సాప్‌లో రైడ్‌ బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది పొందవచ్చు.అయితే ఇలా వాట్సాప్‌ లో బుక్ చేసుకునేకంటే డైరెక్ట్ గా ఉబర్‌లో బుక్ చేసుకుంటే లభించే ఉపయోగాలు వేరు.

ఉబర్ లో రైడ్ బుక్ చేసుకుంటే మీకు సేఫ్టీ ఫీచర్లు, ఇన్సూరెన్స్ లాంటివి వర్తిస్తాయి.అలాగే వాట్సాప్ లో మీరు రైడ్ బుక్ చేసుకుంటే యాప్‌లో చూపించినట్టే డ్రైవర్ పేరు,ఆ వెహికిల్ నంబర్ తో పాటు డ్రైవర్ లొకేషన్ కూడా మీకు కనిపిస్తాయి.

Telugu Message, Process, Uber, Whats-Latest News - Telugu

మరి వాట్సాప్‌ ద్వారా ఉబర్ రైడ్‌ బుక్ చేసుకోవడం ఎలానో చూద్దామా.ఉబర్ రైడ్‌ ను వాట్సాప్‌ యూజర్లు మూడు రకాలుగా బుక్ చేసుకోవచ్చు.మొదటి పద్దతిలో ఉబర్ బిజినెస్ అకౌంట్‌కు వాట్సాప్‌ నుంచి మెసేజ్ చేయడం ద్వారా, అలాగే రెండోది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా, మూడోది ఉబర్ వాట్సాప్‌ చాట్ ఓపెన్ అయ్యే లింక్ పై క్లిక్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.ఈ క్రమంలో ఉబర్ సంస్థ ఈ విధంగా స్పందించింది.

భారతీయులకు రైడ్ ను సులభంగా అందించాలనే ఉద్దేశంతో, వారు వినియోగిస్తున్న ప్లాట్‌ఫామ్‌ లోనే వారికి రైడ్ బుక్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని కల్పించడం కోసమే వాట్సాప్‌ తో మేము భాగస్వామ్యం పొందామని ఉబర్ సంస్థ తెలిపింది.

#Message #Process #Uber

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube